close
Choose your channels

క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది!

Sunday, September 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామ సచివాలయ పరీక్షా ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వహణ ఎంతో క్లిష్టమైందని.. శాఖలపై నిరంతర పర్యవేక్షణ, అనుక్షణం అప్రమత్తత అవసరమని బాబు చెప్పుకొచ్చారు.

ఏపీపీఎస్సీ ప్రతిష్టకే మచ్చ వస్తోంది..!

‘సకాలంలో సరైనరీతిలో స్పందించి సమర్ధమైన చర్యలు చేపట్టాలి. పరిపాలనకు అనుభవం ఎంత అక్కరకు వస్తుందో.. కార్యదక్షత అంతకుమించి దోహదకారి అవుతుంది. ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు మీ అనుభవ రాహిత్యం, చేతకానితనం. పక్షపాతంతో పాటు కక్ష సాధింపు వైఖరే కారణం. ఉద్యోగాల పేరుతో 20 లక్షల మంది అభ్యర్థులుకు ఇబ్బందులు పెట్టారు. మీ చర్యల వల్ల ఏపీపీఎస్సీ ప్రతిష్టకే మచ్చ వస్తోంది. ఒక్కో ఉద్యోగాన్ని 4లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది. ప్రశ్నాపత్రాలు ఏపీపీఎస్సీకి పోకన్నా ముందే రిటైర్డ్ అధికారికి ఎలా చేరాయి?. కమిషన్ ఆఫీస్‌ సిబ్బందికి క్వశ్చన్ పేపర్లు ఎలా అందాయి’ అని జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.