హీరోగా మారిన విలన్‌పై చంద్రబాబు ప్రశంసలు

కరోనా మహమ్మారి వచ్చి హీరోలను జీరోలను చేస్తే.. ఓ విలన్‌ని మాత్రం రియల్ లైఫ్ హీరోని చేసింది. సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి వలస కార్మికులను సొంతూళ్లకు పంపించి సోనూసూద్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీంతో ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పేరిట టీస్టాల్స్ సైతం వెలిశాయి. తాజాగా ఆయన చేసిన పనితో.. ‘దైవం మానుష రూపేణా..’ అంటోంది ప్రజానీకం. అంతలా ఆకట్టుకున్నారు.

చిత్తూరు జిల్లా మహల్‌రాజపల్లిలో నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దానిని చూసిన సోనూ చలించిపోయి వారికి జత ఎద్దులను కొనిస్తానని హామీ ఇచ్చి.. కొద్దిసేపటికే ఎడ్లను బదులు ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిందే తడవుగా వెంటనే మదనపల్లెలో సోనాలికా ట్రాక్టర్ డీలర్‌కు కొనుగోలు ఆర్డర్ ఇచ్చి సాయంత్రానికి ట్రాక్టర్‌ను నాగేశ్వరరావు ఇంటికే పంపించేశారు. సోనూ హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ట్రాక్టర్ తమ ఇంటి ముందు ఉండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

ప్రశంసల జల్లు కురిపించిన చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబు.. సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురింపించారు. అంతేకాదు రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సోనూ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మాటలు తనకెంతో స్ఫూర్తినిస్తాయని.. త్వరలో ఆయనను కలుస్తానని సోనూ తెలిపారు. తను తన సినీ కెరీర్‌ను హైదరాబాద్ నుంచే ప్రారంభించానని తెలిపాడు.

More News

ఆదా శర్మ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణం తో విప్రా దర్శకత్వం లో

పబ్‌జి సహా 280 యాప్‌ల నిషేధించనున్న కేంద్రం!

చైనా యాప్‌ల నిషేధంపై కేంద్రం మరోమారు దృష్టి సారించింది. ఇప్పటికే 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం..

దేశంలో 14 లక్షలు దాటిన కేసులు.. తాజాగా షాకింగ్ స్థాయిలో నమోదు

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్ : 800 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ..

టీటీడీపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా రెండు నెలలకు పైగానే భక్తులకు పూర్తిగా దర్శనం లభించలేదు.

డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేసిన‌ నాగశౌర్య 20 ఫ‌స్ట్‌లుక్

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై