జగన్, మోదీకి కంగ్రాట్స్.. తర్వాత మాట్లాడుతా!

  • IndiaGlitz, [Friday,May 24 2019]

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఫలితాల అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యతన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు మాటల్లోనే..

టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదములు.. శ్రేయోభిలాషులకు అభినందనలు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష.. విశ్లేషించుకుంటాము. ఈవీఎంలపై నేను ఇప్పుడేమీ మాట్లాడను. ఇప్పుడేం మాట్లాడలేను.. తర్వాత విశ్లేషిస్తాము. ప్రజాస్వామ్యంలో ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత అని మూడే మూడు ముక్కల్లో చంద్రబాబు ప్రెస్‌మీట్ ముగించేశారు. కాగా ప్రెస్‌మీట్‌కు ముందే చంద్రబాబు తన రాజీనామా లేఖను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు పంపగా ఆయన ఆమోదించారు. ఇదిలా ఉంటే ఈ నెల 30న విజయవాడలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.

More News

జగన్‌, మోదీకి పవన్ శుభాకాంక్షలు.. మాట నిలబెట్టుకోండి!

ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. రెండు స్థానాల్లో పవన్ పోటీ చేసినప్పటికీ ఒక్కస్థానంలో గెలవకపోవడం గమనార్హం.

హిస్టరీ క్రియేట్ చేసిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 'ఫ్యాన్‌' గాలి కనీవినీ ఎరుగని.. ఊహించని రీతిలో వీచింది. ఫ్యాన్ దెబ్బకు అటు సైకిల్.. ఇటు గ్లాస్ ఎక్కడెళ్లి పడ్డాయో అర్థం కానిపరిస్థితి!.

ఓటమి పై నారా లోకేశ్ స్పందన..

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేశ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఓట్లు మాత్రం రాలకపోవడంతో నైరాశ్యంలో పడ్డారు.

లోకేశ్‌ ఘోర పరాజయం.. ఆర్కే ఘన విజయం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఘోర పరాజయం చవిచూశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకర్గం నుంచి పోటీచేసిన నారా లోకేశ్

నేను ఐరెన్‌లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్!

"ఐరన్‌లెగ్‌ .. రోజా గెలిస్తే జగన్‌ సీఎం కాలేరని విమర్శించిన వారందరికీ నా విజయం చెంపపెట్టు.. నాది గోల్డెన్‌ లెగ్‌.. నేను ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తాను" అని వైసీపీ