అధికారం పోయినా అరాచకం తప్పలేదు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు చేసిన తప్పుల్ని ఎండగట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయినా, ఆ పార్టీ నేతల అరాచకాలు మాత్రం ఇంకా తగ్గలేదన్నారు బాబు.
అందుబాటులో ఉన్న నేతలతో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో సమావేశమయ్యారు చంద్రబాబు. ఉపాధ్యాయ, పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మరోసారి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టారు
జగన్ ఆటవిక రాజ్యంలో దాడులు, డ్రగ్స్, దౌర్జన్యాలు, హత్యలు ఎక్కువగా జరిగాయని.. ఇకపై ఇలాంటివి ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు ముఖ్యమంత్రి. నా దళితులు అంటూనే డాక్టర్ సుధాకర్ లాంటి ఎంతోమందిని జగన్ పొట్టనపెట్టుకున్నారని, చాలామందిని వేధింపులకు గురిచేశారని విమర్శించారు.
తెలుగుదేశం కార్యకర్తల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మరోసారి భరోసా ఇచ్చారు చంద్రబాబు. సభ్యత్వం తీసుకున్నవాళ్లందరికీ బీమా వర్తిస్తుందని.. కొత్త సభ్యత్వం తీసుకొని నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తలకు ప్రస్తుతం బీమా సౌకర్యం అందడం లేదని, అలాంటి వాళ్లను పార్టీ తరఫున ఆదుకుంటామని స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments