ఆదాయంపై దృష్టిపెట్టిన చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ఓవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే, మరోవైపు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే వనరులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇందులో భాగంగా పన్నులపై ఆయన సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో పన్నులు సరిగ్గా వసూళ్లు కావడం లేదని గుర్తించారు. దీని కోసం ఏఐ ఆధారిత పన్నుల విధానం తీసుకురావాలని నిర్ణయించారు. ప్రతి శాఖకు ఏఐ బృందం తప్పకుండా ఉండాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలందించేలా 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 'బంగారం అత్యధికంగా కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ.. పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడుల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే, రాష్ట్రంలో ఎందుకు తక్కువగా వస్తుందో పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక మద్యం పాలసీపై సమీక్ష నిర్వహిస్తూ, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తెచ్చి రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ పోలీసుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకాల వరకు రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండాలన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com