close
Choose your channels

‘బీసీజీ రిపోర్ట్ అంతా బోగస్.. ప్రజలకు ధైర్యం లేదా..?’

Saturday, January 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘బీసీజీ రిపోర్ట్ అంతా బోగస్.. ప్రజలకు ధైర్యం లేదా..?’

నవ్యాంధ్ర రాజధానిపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి బీసీజీ ప్రతినిధులు నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘బీసీజీ ఎప్పుడు వేశారు..తల తోక ఉందా?. క్లయింట్‌కు ఏది కావాలంటే అది రాసిస్తుంది..బీసీజీ గ్రూప్‌ అదే చేసింది. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలున్నాయ్. రోహిత్‌రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చింది. ఈ నివేదికకు విశ్వసనీయత ఉందా?. అజయ్‌ కల్లాం చెప్పింది రాసిచ్చానని జీఎన్‌.రావు చెప్పాడు. ఎవరిని మోసం చేయడానికి హైపవర్‌ కమిటీ?. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం సరికాదు’ అని చంద్రబాబు హితవు పలికారు.

ప్రజలకు దమ్ములేదా..!?
‘ఉద్యోగులను జగన్‌ బెదిరిస్తున్నారు. జగన్‌కు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు.. వాటిని పొడిచేశారు. అడిగే ధైర్యం రాష్ట్ర ప్రజలకు లేదా?. టీడీపీ కార్యకర్తలపై కక్ష తీర్చుకుంటున్నారు. నరేగా డబ్బులను డైవర్ట్ చేస్తారా?. నిరుద్యోగ భృతి, విదేశీ విద్యకు సాయం ఆపేశారు. ఏడు నెలల్లో ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు?’ అని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు.

మీదో గ్రూపేనా!?
‘బీసీజీ రిపోర్ట్‌ ఇచ్చిన అరగంటలో ప్రెస్‌మీట్‌ పెట్టారు. అంత ప్రావీణ్యత మీకుందా?. రాజధానిని నిర్ణయించడానికి నారాయణ కమిటీ వేశారంటూ అసత్యాలు చెబుతున్నారు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ కంటే.. మేం తయారు చేసిన విజన్‌ను చదువుకోండి. బీసీజీ రిపోర్ట్ అసత్యాల పుట్ట..చెత్తకాగితం.. ఈ రిపోర్ట్‌ను నమ్మాలా?. బీసీజీ గ్రూప్‌కు విశ్వసనీయత లేదు.. మీదో గ్రూపా..?. రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటారా?. పట్టణీకరణతోనే ఉపాధి..సంపద సృష్టించవచ్చు: చంద్రబాబుప్రకాశం జిల్లాలో రూ.25 వేల కోట్లతో పెట్టాల్సిన పేపర్‌ మిల్లు పోయింది. ఆదానీ డేటా సెంటర్‌ పోయింది’ అని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంపేసి అరుపులు అరుస్తారా?
‘అమరావతిని చంపేసి పేద అరుపులు అరుస్తారా?. రాజధానికి లక్షా 10 వేల కోట్లు అవసరమని ఎవరు చెప్పారు?. రాజధాని కోసం మిమ్మల్ని ఎవడు అప్పులు తెమ్మన్నారు?. అమరావతిలో ఇప్పుడున్న వసతులతో పాలన చేయలేరా?. జగన్‌ సొంతంగా సంపాదించి అమరావతిలో ఇల్లు కట్టారా?. అమరావతిలో జగన్‌ ఇల్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా?’ అని బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

పెట్టుబడులు పారిపోయేలా..!
‘కొత్త నగరాలు సైబరాబాద్‌, నవీముంబై, డెహ్రాడూన్‌ అభివృద్ధి చెందలేదా?. అమరావతిని తీసుకెళ్లి ఫెయిల్యూర్‌ సిటీలతో పోలుస్తారా?. బీసీజీ కన్సల్టెన్సీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. డబ్బు కోసం ఏమైనా చేస్తారా?. ఏ రాష్ట్రంలోనైనా ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేచర్‌ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయా?. పెట్టుబడుదారులు పారిపోయేలా చేశారు. అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్దాలు చెబుతున్నారు. హైదరాబాద్‌, చెన్నై కంటే అమరావతిలోనే తక్కువ ఖర్చవుతుంది. అమరావతిలో కట్టిన బిల్డింగ్‌లు, రోడ్లు మీకు కనిపించలేదా?. రైతులతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను గౌరవించరా?. టీడీపీ హయాంలో ఇరిగేషన్‌కు 74వేల కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ ఏడు నెలల పాలనతో ఇరిగేషన్‌కు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా మీరు..?’ అని బాబు ప్రశ్నించారు.

అక్కడైనా కొనాల్సిందేగా..!
‘విశాఖ వెళ్లినా మళ్లీ రైతుల భూములు కొనాల్సిందే. ఐదారు నెలల్లో భూములు కోనేసుకోండని చెబుతారా?. విశాఖ జిల్లా ఇన్‌చార్జ్‌గా విజయసాయిరెడ్డిని ఎందుకు పెట్టారు?. భూముల సెటిల్‌మెంట్లకు ఏసీపీని పెట్టారు. మాట వినలేదని జాయింట్‌ కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఒక వ్యక్తి ఉన్మాద ప్రవర్తనతో మనం జీవితాంతం బాధపడాలా?. ఎమర్జెన్సీ అసెంబ్లీ ఎన్నడూ వినలేదు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారా?. జేఏసీ పిలుపునకు కట్టుబడి ఉండాలి.. గట్టిగా పోరాడాలి. సీఎం జగన్ వితండ వాదానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. జీఎన్‌.రావు, బీసీజీ రిపోర్టులను బోగీ మంటల్లో తగలబెట్టండి. సంక్రాంతి పండగను అమరావతి సంక్రాంతిగా జరుపుకోండి’ అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos