NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

  • IndiaGlitz, [Friday,March 08 2024]

ఎట్టకేలకు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయమైంది. ఊహించినట్లుగానే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు కట్టగా.. ఇప్పుడు కమలం పార్టీ కూడా జత కట్టనుంది. గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు వారితో సమావేశమయ్యారు. పొత్తు ఖాయమవ్వడంతో సీట్లు సర్దుబాటుపై చర్చలు జరిపారు.

ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంగా బీజేపీ పెట్టుకోవడంతో పాత మిత్రులను మళ్లీ కలుపుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలను ఎన్డీఏలోకి చేర్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ, నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ను కూడా చేర్చుకునేందుకు కమలం పెద్దలు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో బీజేపీ పెద్దలు 10 ఎంపీ సీట్లను అడిగినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు 4 లేదా 5 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం మరోసారి కేంద్ర పెద్దలతో భేటీ అయి సీట్ల సర్దుబాటును ఫైనల్ చేయనన్నారు. అనంతరం ఉమ్మడిగా పొత్తు ప్రటకన చేయనున్నారట. మొత్తమ్మీద బీజేపీకి 5 లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం.

ఇక 175 అసెంబ్లీ సీట్లలో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాలలో పోటీ చేయనున్నాయి. 25 పార్లమెంట్‌ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే... మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు కేటాయించారు. మిగిలిన 5 స్థానాల్లో అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. విశాఖ ఉత్తరం, నర్సాపురం, ధర్మవరం, జమ్మలమడుగు, తిరుపతి, కైకలూరు స్థానాలు ఉన్నాయి.

కాగా 2014లో కలిసి పోటీ చేసిన మూడు పార్టీలు వివిధ కారణాల వల్ల విడిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. అనంతరం జనసేన కూడా టీడీపీకి దూరమైంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశాయి. దీంతో కేంద్రంలోని బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు-పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా జనసేన పార్టీ తిరిగి ఎన్డీఏలోకి చేరింది. అయితే చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. మొత్తానికి చంద్రబాబు-పవన్ ప్రయత్నాలు ఫలించాయి.

More News

Mallareddy:కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుతో భేటీ..!

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్..

Prasanna Vadanam:ఆ వ్యాధితో బాధపడుతున్న సుహాస్‌.. ఆకట్టుకుంటున్న 'ప్రసన్నవదనం' టీజర్

షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సుహాస్.

Pawan Kalyan:వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదు: పవన్ కల్యాణ్‌

రాయలసీమ ఐదుగురు నేతల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

CM Jagan:కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఫైర్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారని విమర్శించారు.

Record Break: 'రికార్డ్ బ్రేక్' ప్రీమియర్ షోలకు వచ్చిన స్పందన చూసి సంతోషంగా ఉంది: చదలవాడ

సీనియర్ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్ హీరోగా నటించిన 'రికార్డ్ బ్రేక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న విడుదలకానంది.