సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా 

  • IndiaGlitz, [Thursday,May 23 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఊహించని రీతిలో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కనివీనీ ఎరుగని రీతిలో ఫ్యాన్ గాలి వీచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయ డంఖా మోగించారు.

దీంతో తన సీఎం పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు చంద్రబాబు లేఖ పంపారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ వెంటనే ఆమోదించారు. ఏపీకి చంద్రబాబు చేసిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలంటూ చంద్రబాబుకు సూచించారు.

కాగా ప్రస్తుతం వైసీపీ 103 సీట్లు గెలిచి మరో 47 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ 13 స్థానాలు గెలిచి మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న తిరుపతి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  

More News

కొత్త కోహినూర్‌లా కోమ‌లి ప్ర‌సాద్‌!

'అమ్మాయి అందంగా ఉంటుందా?' అని ఒక సినిమాలో హీరోయిన్ గురించి హీరోని ఫ్రెండ్ అడుగుతాడు. 'అందంగానా... కోహినూర్ బావా' అని హీరో బదులిస్తాడు. నిజమే...

వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్... 

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలు  వైఎస్ జగన్ గెలుపు అనంతరం ఫలితాలు వీక్షించిన కేసీఆర్..

తేజ స్ట్రాంగ్ వార్నింగ్‌

డైరెక్ట‌ర్ తేజ త‌న సినిమా 'సీత‌'ను విడుద‌ల కానీయ‌కుండా ఆపుతామ‌ని బెదిస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సీత‌'.

ఏపీలో ఏ పార్టీ గెలిచినా జంపింగ్‌లే.. జంపింగ్‌లు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఎప్పుడు ప్రారంభం అవుతుందో..? ఏ పార్టీ గెలుస్తుందో..? అని అటు నేతల్లో.. ఇటు అభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్.

'అభినేత్రి 2' మే 31న విడుద‌ల

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'అభినేత్రి'. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది.