కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చంద్రబాబు పాలన: మంత్రి సవిత


Send us your feedback to audioarticles@vaarta.com


కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, తన కుటుంబ సభ్యుల మాదిరిగా కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టంచేశారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు.
తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. సంపద సృష్టికి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్రంలోని నాలుగు ఈఎస్‌ఐ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య భద్రత, కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, దీనిలో భాగంగా ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తున్నామని తెలిపారు.
ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ (వీటీపీఎస్) కాలుష్యం నియంత్రణతో పాటు ప్లాంట్ నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి రూ.600 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com