'చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి - కామ్న జెఠ్మలాని

  • IndiaGlitz, [Tuesday,July 21 2015]

సంచలన విజయం సాధించిన చంద్రముఖి' తరహాలో రూపొందుతున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ చంద్రిక'. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌' పతాకంపై శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ జయరామ్‌, కామ్నజెఠ్మలాని, శ్రీముఖి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా యోగేష్‌ మునిసిద్దప్ప దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గున్వంత్‌సేన్‌ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది.

వనమాలి, కరుణాకర్‌ అడిగర్ల సాహిత్యం సమకూర్చగా.. సునీత, ఎం.ఎం.శ్రీలేఖ, మాళవిక, కార్తీక్‌ గాత్రమందించారు. ఓ భవనంలో జరిగే అనూహ్య సంఘటన వల్ల ఓ కొత్త జంట ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారని దాని సమాహారంగా, సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కుతున్న చంద్రిక' పోస్ట్‌ ప్రొడక్షన్‌ పను కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఆడియో విడుదల సందర్భంగా ....

చిత్ర కథానాయకుడు కార్తీక్‌ జయరాం మాట్లాడుతూ 'రజనీసార్‌ చంద్రముఖి' చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతం ఎంత ప్లస్సయ్యిందో.. చంద్రిక' చిత్రానికి మా గున్వంత్‌సేన్‌ సంగీతం కూడా అంతే ప్లస్సవుతుంది. గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం వంటి సీనియర్‌ ఆర్టిస్టులతోనూ.. తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ వంటి టాలెంటెడ్‌ ఆర్టిస్టుతోనూ ఈ సినిమాలో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది' అన్నారు.

చిత్ర కథానాయకి కామ్న జఠ్మలాని మాట్లాడుతూ... నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లోకి ది బెస్ట్‌'గా నిలిచే సినిమా చంద్రిక'. ఈ చిత్రంలో శ్రీముఖి పాత్ర కూడా చాలా బాగుంటుంది. అలాగే హీరో కార్తీక్‌ జయరాం కూడా చాలా బాగా పెర్‌ఫార్మ్‌ చేసాడు. చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి' అన్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్‌ మునిసిద్దప్ప మాట్లాడుతూ.. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ'స్క్రీన్‌ప్లే, గున్వంత్‌సేన్‌ మ్యూజిక్‌ చంద్రిక' చిత్రానికి ఆయువుపట్టుగా నిుస్తాయి. చంద్రముఖి'లా చిరకాలం గుర్తుండిపోయేంత గొప్పగా.. గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న చంద్రిక' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి, కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ- స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: శ్రీమతి వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌ మునిసిద్దప్ప.

More News

'రుద్రమదేవి' రిలీజ్ డేట్

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో రిలీజ్ డేట్

‘రేయ్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాల్లో మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా

జూలై 24న వస్తున్న 'జిల్లా'

తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈనె 24న విడుదలవుతోంది.

డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'ఎలుకా మజాకా'

74 చిత్రాల అద్భుత హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్’ అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన

సెప్టెంబర్ 17న వినాయకచవితికి రామ్ 'శివమ్' రెడీ

'పండగ చేస్కో' వంటి ఘనవిజయం తర్వాత రామ్ తెరపై కనిపించబోతున్న చిత్రం 'శివమ్'.