close
Choose your channels

శ్రియ ఎందుకు మారిపోయింది?

Friday, August 31, 2018 • తెలుగు Comments

శ్రియ ఎందుకు మారిపోయింది?

పెళ్ల‌యితే అమ్మాయిల్లో మార్పు వ‌స్తుందంటారు. ఇప్పుడు శ్రియ‌ను చూసిన వారంద‌రూ ఆ మాట నిజ‌మేన‌ని అంటున్నారు. ఇంత‌కీ ఎందుకు అలా అంటున్నారు అని అనుకుంటున్నారా... మ‌రేం లేదండీ.. శ్రియ ఇటీవ‌ల తిరుమ‌ల వెళ్లింది. తిరుమ‌ల బాలాజీ అంటే శ్రియ‌కు చాలా అభిమానం.

అందుకే ఆమె త‌ర‌చూ తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ఇటీవ‌ల ర‌ష్య‌న్‌ని వివాహం చేసుకున్నారు శ్రియ‌. తాజాగా పెళ్ల‌య్యాక ఆమె త‌ల్లితో తిరుమ‌ల‌కు వెళ్లారు. అక్క‌డ వీఐపీ ద‌ర్శ‌నం చేసుకున్నారు. అయితే ఇదివ‌ర‌కు ఆమె వీఐపీ ద‌ర్శ‌నం చేసుకున్నాక మీడియాతో మాట్లాడేవారు.

కానీ తాజాగా మాత్రం ముఖానికి ముసుగు వేసుకుని మీడియాతో మాట్లాడ‌కుండా వేగంగా వెళ్లిపోయారు. శ్రియ‌లో వ‌చ్చిన మార్పు చూసి తిరుమ‌ల మీడియా `ఔరా శ్రియ‌లో ఎంత మార్పూ` అని అనుకుంటున్నార‌ట‌. 

Get Breaking News Alerts From IndiaGlitz