close
Choose your channels

BiggBoss: చంటి vs గీతూ.. గువ్వ పగులగొడతానన్న ఆదిరెడ్డి, ప్రేక్షకుల్ని ఏడిపించిన రేవంత్

Friday, September 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ హౌస్‌లో రెండ్రోజులుగా జరుగుతోన్న హోటల్ టాస్క్‌కి ఎండ్ కార్డ్ పడింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దీనిలో భాగంగా టాస్క్ నుంచి ఔటైన వారు మిగిలిన వారిలో ఎవరు కెప్టోన్ కాకూడదో నిర్ణయిస్తారు. గేమ్ నుంచి ఔటైన రేవంత్, చంటి, ఇనయా, ఆదిరెడ్డి, సూర్య, బాలాదిత్యలకు ఈ మేరకు పవర్స్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో వున్న వారి ఫోటోలను గార్డెన్ ఏరియాలో వున్న బోర్డ్‌ తగిలించారు. మధ్యలో టేబుల్‌పై బాక్సింగ్ గ్లవ్ పెట్టారు. ఔటైన వారంతా బెల్ మోగినప్పుడల్లా బాక్సింగ్ గ్లవ్ తీసుకుని, అక్కడున్న ఫోటోల్లో ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కాకూడదు అనుకుంటున్నారో వారి ఫోటోపై పంచ్ ఇవ్వాలి.

ఈ టాస్క్‌లో భాగంగా రేవంత్ గ్లవ్స్ దక్కించుకుని రాజశేఖర్‌ను... సూర్య వాసంతిని.... ఆదిరెడ్డి అర్జున్‌ని... బాలాదిత్య ఫైమాలను ఔట్ చేశారు. ఇదే సమయంలో చంటి రెచ్చిపోయాడు. గీతూని టార్గెట్ చేసిన ఆయన ఆమె ఫోటో మీద పంచ్ ఇచ్చాడు. కెప్టెన్ అంటే అందరితో స్నేహంగా వుంటూ.. పనులను పంచాలి, అది ఆమెలో కొంచెం కూడా లేదు ’’ అని చంటి రీజన్ చెప్పాడు. దీంతో రగిలిపోయిన గీతూ పాప చంటిని రెచ్చగొట్టేలా మాట్లాడింది. గేమ్ ఆడటం రానోళ్లు నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా వుందంటూ సెటైర్లు వేసి అక్కడి నుంచి బాత్రూమ్‌లోకి వెళ్లిపోయింది. లోపలికి వెళ్లాక కూడా తన నోటి దురదను తీర్చుకుంది. గేమ్ ఆడటం రానోళ్లే మీరేనంటూ పదే పదే వాదించింది. చంటి కూడా నీకు తెలిసిందే చెటాకు.. దానినే నువ్వు గేమ్ అని ఫీలావుతున్నావని బదులిచ్చాడు. దానికి రెచ్చిపోయిన గీతూ.. నన్ను ఎవడూ ఏం చేయలేడు అంటూ కామెంట్ చేసింది.

ఇంత జరిగినా ఆదిరెడ్డి మాత్రం.. గీతూకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాని తన మనసులోని మాటను చెబుతాడు. అందుకే ఆమె ఫోటోని బ్రేక్ చేయడం లేదని తెలిపాడు. ఆ తర్వాత కాసేపటికే గార్డెన్ ఏరియాలో ఆదిరెడ్డితో ఏదో వాగింది గీతూ. దీనిపై భగ్గుమన్న ఆది... తాను తప్పు చేశానని, మరో ఛాన్స్ ఇస్తే గీత గువ్వ పగులగొడతానంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు తనను కెప్టెన్ కాకుండా చేసిన చంటిపై పగబట్టిన గీతూ..రేవంత్ ద్వారా తన పగ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. అతనికి గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసేలా మాట్లాడింది.

ఇక.. ఈ రోజు అన్నింటిలోకి హైలైట్.. రేవంత్ భార్య అన్విత సీమంతం. తాను బిగ్‌బాస్ హౌస్‌లో వుండటంతో రేవంత్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. దీనిపై ఇప్పటికే డల్‌గా వున్న రేవంత్‌కి బిగ్‌బాస్ నిర్వాహకులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. రేవంత్‌ని గార్డెన్ ఏరియాకి పిలిపించి... గత వారం జరిగిన మీ భార్య సీమంతం వేడుకలో మీరు పాలు పంచుకోలేకపోయినందున , ఆ జ్ఞాపకాలను మీకు చూపించాలనుకుంటున్నా అని అన్విత సీమంతం వీడియోను చూపించారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు రేవంత్ కళ్ల వెంట నీరు వస్తూనే వుంది. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ఇది చాలు బిగ్‌బాస్.. టైటిల్ గెలిచినంత హ్యాపీగా వుంది. తన భార్యకి ఫ్రీ డెలివరీ అవ్వాలి.. తల్లీబిడ్డా క్షేమంగా వుండాలని కోరుకున్నాడు. టైటిల్ గెలిచి తన బేబీకి ఇవ్వాలని రేవంత్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ సీన్‌తో ఓటింగ్‌లో ఇప్పటికే టాప్‌లో రేవంత్ ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్లిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ రేవంత్‌కు గట్టి మద్ధతుగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగర్‌గా, ఇండియన్ ఐడల్‌గా రేవంత్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ వుండటంతో రేవంత్ ఓటింగ్‌లో టాప్‌లో వుంటున్నాడు. గేమ్ సరిగా ఆడితే రేవంత్ అనుకున్నట్లుగా కప్‌తో తన బేబీని ముద్దాడటం పెద్ద కష్టమేమీ కాదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.