'ఊపిరి'లో ఎవరి పాత్రలు ఏమిటంటే..

  • IndiaGlitz, [Friday,October 09 2015]

'బృందావ‌నం', 'ఎవ‌డు' చిత్రాల విజ‌యాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ ద్విభాషా చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. తెలుగులో 'ఊపిరి'గా, త‌మిళంలో 'తోళా' గా ఈ సినిమా రూపొందుతోంది. 'సెల‌బ్రేష‌న్ ఆఫ్ లైఫ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా, అనుష్క (అతిథి పాత్ర‌), జ‌య‌సుధ వంటి భారీ తారాగ‌ణం ఉన్న ఈ సినిమాకి 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'భ‌లేభ‌లే మ‌గాడివోయ్' ఫేమ్ గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఫ్రెంచ్ ఫిల్మ్ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి ఇది అఫీషియ‌ల్ రీమేక్‌.

కాగా.. ఇందులో ఎవ‌రి పాత్ర ఏమిట‌నే దానికి కార్తీ ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో వివ‌రాలు అందించారు. దాని ప్ర‌కారం.. అనుకోని ప‌రిస్థితుల్లో వీల్ ఛైర్‌కి ప‌రిమిత‌మ‌యి.. మ‌నోవేద‌న‌కు గుర‌య్యే మ‌ల్టీ బిలియ‌నీర్ విక్ర‌మ్ పాత్ర‌లో నాగార్జున క‌నిపించ‌నున్నాడు. ఇక‌..కార్తీది నిరుపేద అనాధ క్యారెక్ట‌ర్‌. జీవితంలో అనూహ్యంగా ఎద‌గాల‌నుకునే ఈ పాత్ర‌.. ఏ ప‌రిస్థితుల్లో నాగ్ వ‌ద్ద‌కు చేరుకుంది అనేది సినిమాలో కీల‌కాంశం. ఇక త‌మ‌న్నా.. నాగ్‌కి సెక్ర‌ట‌రీ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌.

More News

బన్ని , బోయపాటిల ప్రయత్నం ఫలించేనా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రంలో బన్ని సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

బాలకృష్ణ చేతులమీదుగా 'సతీ తిమ్మమాంబ' ఆడియో విడుదల

శ్రీ వెంకట్,భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ.

చరణ్ కి విలన్ ఇతనే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా తర్వాత తమిళ్ సినిమా తని ఒరువన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

4 ఏళ్ల తరువాత విక్రమ్ డబుల్ ధమాకా

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ..తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న తమిళ కథానాయకుడు విక్రమ్.తెలుగులోనూ తనకంటూ ఓ మార్కెట్ ని సొంతం చేసుకున్న విక్రమ్ ఈ ఏడాది ఆరంభంలో 'ఐ'సినిమాతో పలకరించాడు.

కళ్యాణ్ రామ్ హీరోయిజానికి 12 ఏళ్లు..

2015..పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది.అయితే ఈ సంవత్సరంలో ఈ బ్లాక్ బస్టర్ అనే పదానికి శ్రీకారం చుట్టిన సినిమా మాత్రం 'పటాస్'.