ఒక్క అడుగు.... ధ్వనించి పదేళ్లు

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ప్ర‌భాస్ ఆవేశంతో చెప్పిన‌ డైలాగులు ఇంకా మ‌న చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. బాజీరావు పేరును ఇంకా ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. గుండు సూదీ గుండు సూదీ గుచ్చుకుంటే త‌ప్పు నీదీ అని, ఏ వ‌చ్చి బీ పై వాలే అని ఇంకా పాడుకుంటూనే ఉన్నాం. అప్పుడే ఆ సినిమాకు ప‌దేళ్ళు పూర్త‌య్యాయి. అవును. ఛ‌త్ర‌ప‌తి విడుద‌లై సెప్టెంబ‌ర్ 30వ తేదీకి ప‌దేళ్ళు పూర్త‌య్యాయి.

అప్ప‌టిదాకా మ‌ద్రాసులో నిర్మాత‌గా ఓ వెలుగు వెలిగిన బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ హైద‌రాబాద్‌కు వ‌చ్చాక యంగ్ యాక్ట‌ర్స్ తో సినిమా తీయ‌డం మొద‌లుపెట్టింది కూడా అప్పుడే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను త‌న సంస్థ‌లో 15కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో రూపొందించారు బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్‌. ఈ సినిమాకు సంబంధించి చాలా తీపి గుర్తులున్నాయ‌ని అంటారు ప్ర‌సాద్‌. ఆ సినిమా హిట్ అయి ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మారిన వైనాన్ని మ‌ర్చిపోవ‌డం అంత తేలిక‌కాద‌నీ అంటారు. ష్యూర్ హిట్ సినిమా అని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను చెప్పిన‌ప్పుడే అనుకున్నాన‌నీ అన్నారు నిర్మాత‌.

More News

చిరు 150వ సినిమా కన్ ఫర్మ్

మెగాస్టార్ 150వ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇక ఆ ఎదురుచూపులకు తెరపడినట్టే.మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

హరికథలో రామ్ లుక్

హరికథ సినిమాలో రామ్ కొత్త లుక్ లో కనిపించనున్నారు.ఆ సినిమా కోసం ప్రస్తుతం గడ్డం పెంచుతున్నారు.

చిరు 150వ సినిమా నేనే చేస్తానంటున్న పూరి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి.కానీ.. సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేదు.

రానా సంతకం...

బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుంచి ఆ టీమ్ అందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చిందన్నది కాదనలేని నిజం.ఆ సినిమా కెమెరామేన్ సెంథిల్ ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు సంతకం చేశారు.

బ్రహ్మోత్సవం సాంగ్ కి అంతైందా...?

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.