close
Choose your channels

‘కేరింత’ హీరోపై చీటింగ్ కేసు

Wednesday, January 20, 2021 • తెలుగు Comments

‘కేరింత’ హీరోపై చీటింగ్ కేసు

యువ హీరో విశ్వంత్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో చీటింగ్‌ కేసు న‌మోదైంది. త‌క్కువ ధ‌ర‌కే కార్లు ఇప్పిస్తామంటూ విశ్వంత్ కొంత మంది ద‌గ్గ‌ర డ‌బ్బులు వ‌సూలు చేశాడు. కార్లు ఇప్పించ‌కుండా తిరుగుతుండ‌టంతో బాధితులు బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. విశ్వంత్ త‌మ‌ను న‌మ్మించి మోసం చేశాడ‌ని బాధితులు పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తనపై వస్తున్న వార్తలపై విశ్వంత్, సంబంధిత వ్యక్తులు స్పందించలేదు. 

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన కేరింత సినిమాలో నలుగురు హీరోల్లో ఒక‌రిగా విశ్వంత్ న‌టించాడు. దీంతో పాటు మోహ‌న్‌లాల్, చంద్ర‌శేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌నమంతా సినిమాలోనూ న‌టించాడు. అలాగే ఓ పిట్ట‌క‌థ చిత్రంలోనూ న‌టించిన విశ్వంత్ వెబ్ సిరీస్‌ల్లోనూ న‌టించాడు. 

సామర్లకోటకు చెందిన విశ్వంత్, పదో తరగతి వరకు వైజాగ్‌లో, ఇంటర్‌ను హైదరాబాద్‌లో, ఇంజనీరింగ్‌ను కోయంబత్తూరులో చదివాడు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి, తర్వాత నటుడిగా మారాలని ప్రయత్నాలు చేసే సమయంలో కేరింత సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

Get Breaking News Alerts From IndiaGlitz