ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన చెన్నై కోర్ట్

  • IndiaGlitz, [Wednesday,April 06 2022]

వైసీపీ సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త , ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2016లో ఆర్కే సెల్వమణి, తమిళనాడులో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు కలిసి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫైనాన్షియర్‌ ముకుంద్‌చంద్‌ బోద్రా అనే వ్యక్తి గురించి పలు అభిప్రాయాలు పంచుకున్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే ఉద్దేశంతో బోద్రా వారిద్దరిపై చెన్నై జార్జిటౌన్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ దశలో వుండగానే ముకుంద్ చంద్ర బోద్రా మృతిచెందారు. అయితే ఆయన తదనంతరం ఆ కేసును అతని కుమారుడు గగన్‌ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం చెన్నై జార్జి టౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెల్వమణి, అరుళ్‌లు ప్రత్యక్షంగా హాజరు కావాలని గతంలోనే కోర్టు ఆదేశించింది.

అయితే విచారణ సందర్భంగా సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. వారి తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు గైర్హజరయ్యారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరిపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. సెల్వమణి ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

More News

రాజ్‌తరుణ్‌, `శివాని రాజశేఖర్ ల కామెడీ, రొమాన్స్‌ ‘అహ నా పెళ్ళంట’ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ప్రారంభం

ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పేటలెక్కిన వ్యక్తికి తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో

వరుణ్ తేజ్ ‘గని’ సినిమాకు కేసీఆర్ సర్కార్ షాక్.. టికెట్ రేట్స్ తగ్గింపు, మూవీ లవర్స్‌కి బిగ్ రిలీఫ్

కోవిడ్ సమయంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది చిత్ర పరిశ్రమ. లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా ఎక్కడికక్కడ షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి.

విజయ దేవరకొండ విడుదల చేసిన 'పంచతంత్రం' లోని 'అరెరే..అరెరే.. మాటే..రాదే...' లిరికల్ వీడియో

టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌,

జనం కోరుకున్నదొకటి.. జగన్ సర్కార్ చేసింది మరొకటి : జిల్లాల ఏర్పాటుపై పవన్ ఆగ్రహం

పలుమార్లు వాయిదా పడుతూ.. అక్కడక్కడా నిరసనలు చికాకు పెట్టినా ఎట్టకేలకు ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం.. కలెక్టరేట్‌లు ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ రోజు కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి.