close
Choose your channels

కరోనాను రెండు నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు.. చెన్నై విద్యార్థుల ఘనత

Friday, April 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా మహమ్మారి సోకిందనే అనుమానం ఒక ఎత్తైతే.. నిజంగా సోకిందా? లేదా? అని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం ఒక ఎత్తు. ఏ ఆసుపత్రి చూసినా రోగులతో ఫుల్‌గా కనిపిస్తోంది. కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిమిటెడ్ పరీక్షలు.. దీనికోసం తెల్లవారుజామునే వెళ్లి క్యూలో నిలబడాలి. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే పరిస్థితి మరింత ఘోరం. ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇవాళ స్లాట్ బుక్ చేసుకుంటే.. రెండు రోజుల తర్వాత కానీ మనకు డేట్ ఇవ్వరు. ఇంత చేసి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నామా? ఫలితం రావాలంటే 78 గంటలు వేచి చూడాల్సింది.

వీటన్నింటికీ చెన్నై యువకుడు ఒకరు చెక్ పెట్టారు. ఓ పరికరాన్ని రూపొందించారు. దాని పేరు ‘కేజే కొవిడ్‌ ట్రాకర్‌’. దీని ద్వారా రెండు నిమిషాల్లోనే కరోనా సోకిందా.. లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. చెన్నై కీజపక్కంలోని కేజే ఆసుపత్రి, పీజీ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు దీన్ని రూపొందించారు. చెయ్యి ఆకారంలో ఉండే ఈ పరికరంలో నానో, మెడికల్‌ ఎలక్ట్రానిక్‌ సాంకేతికతను వాడారు. ట్రాకర్‌ను ఓ సెన్సర్‌ ద్వారా ల్యాప్‌టాప్‌నకు అనుసంథానించాల్సి ఉంటుంది. పరీక్ష అవసరమైన వారు కేజే కొవిడ్‌ ట్రాకర్‌పై అరచేతిని ఉంచితే చాలు. రెండు నిమిషాల్లోనే ఆ వ్యక్తి రక్తపోటు, ఆక్సిజన్‌ స్థాయులు, శరీర ఉష్ణోగ్రత, రక్తకణాల సంఖ్య, హిమోగ్లోబిన్‌, జీటా పొటెన్షియల్‌ స్థాయులు.. వంటి వివరాలన్నీ సెన్సర్‌ ద్వారా ల్యాప్‌టాప్‌లో కనిపిస్తాయి.

వాటి ఆధారంగా అనుమానితుడికి కరోనా సోకిందా లేదా అనేది క్షణాల్లోనే తేల్చవచ్చు.‘కేజే కొవిడ్‌ ట్రాకర్‌’తో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పలువురు రోగులను పరీక్షించి, వంద శాతం కచ్చితమైన ఫలితాలను రాబట్టినట్లు కేజే ఆసుపత్రి, పీజీ రీసెర్చ్‌ సెంటర్‌ హెడ్‌ కేశవన్‌ జగదీశన్‌ తెలిపారు. ఆర్‌టీపీసీఆర్‌తో పోలిస్తే మరింత కచ్చితత్వంతో, వేగంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న తాము... కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌ పరీక్షలపై దృష్టిసారించి, ఈ ట్రాకర్‌ను రూపొందించినట్లు వైద్య విద్యార్థి తేజస్వి వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే.. కరోనా టెస్ట్ మరింత సులభమవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.