ఈ ఏడాది కూడా చేపమందు ప్రసాదానికి బ్రేక్..

  • IndiaGlitz, [Sunday,May 30 2021]

ఈ ఏడాది కూడా చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా గతేడాది చేపమందు పంపిణీకి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు నెలకొని ఉండటంతో ఈ ఏడాది కూడా చేపమందు ప్రసాదం పంపిణీ లేదని బత్తిని హరినాధ్ గౌడ్ తెలిపారు. ప్రమాదకర రీతిలో కరోనా కేసులు పెరగటమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నామన్నారు.

ప్రతి ఏడాది మృగశిరకార్తె రోజున ఉబ్బసం వ్యాధిని తగ్గించేందుకు బత్తెన సోదరులు చేపమందు పంపిణీ చేస్తుంటారు. అయితే గత ఏడాది నుంచి దీనికి బ్రేక్ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని బత్తిని హరినాధ్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ లో నివాసముండే బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబీకులు 173 సంవత్సరాల నుంచి చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు. దీనిపై ఎన్నో వాదోపవాదాలు నెలకొన్నప్పటికీ ఆదరణ విపరీతంగా ఉండటంతో పాటు ఎవరికీ ఎలాంటి హానీ లేకపోవడంతో ప్రభుత్వమే చేప మందు ప్రసాదం పంపిణీకి ప్రతి ఏడాది ఏర్పాట్లు చేస్తూ వస్తోంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి సైతం ఈ ప్రసాదాన్ని తీసుకోడానికి ఉబ్బసం రోగులు వస్తుంటారు. ఇలా ప్రతిసారీ దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ మందును తీసుకోడానికి వచ్చేవారు. ప్రభుత్వ సహకారంతో జరిగే ఈ చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లతోపాటు ప్ర‌భుత్వ‌మే చేపలను కూడా సరఫరా చేసేది. అలాగే భారీగా తరలివచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లనూ ప్రభుత్వమే చూస్తూ ఉంటుంది. 173 ఏళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్న ఈ చేప మందు ప్రసాదం పంపిణీకి వరుసగా రెండో యేడు బ్రేక్ పడింది.

More News

ప్రభుత్వం నీచానికి దిగజారింది: ఈటల సతీమణి జమున

ప్రభుత్వ యంత్రాంగంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున మండిపడ్డారు. మాసాయిపేటలో మోడ్రన్‌ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని,

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా కొవిడ్ వైరస్‌ను చూడాలనుకుంటున్నారా?

గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్ అనేది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా బుల్లెట్‌నే చూపిస్తామంటున్నారు

తానా ఎన్నికల్లో నిరంజన్‌ ప్యానెల్ ఘ‌న విజ‌యం

ఈసారి జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించాయి. ప్రతిష్మాత్మక ‘తానా’ సంస్థలో పలు కీలకమైన పదవుల కోసం జరగనున్న

మరో కొత్త ఫంగస్.. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి

కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో తొలుత ట్రీట్‌మెంట్ విషయంలోనే కాస్త ఆందోళన చెందాం. ఆ తరువాత కరోనా ఒక్కటి అదుపులోకి వస్తే చాలని భావించాం. అనుకున్నట్టుగానే

యువ హీరోతో యువీ క్రియేషన్స్ డీల్.. తెరవెనుక ప్రభాస్ ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ యువ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడే సంతోష్ శోభన్. ఇటీవల ఓటిటీలో విడుదలైన ఏక్ మినీ కథ చిత్రంలో సంతోష్ హీరోగా నటించాడు.