close
Choose your channels

‘కరోనా’ : కేవలం 9 రోజుల్లోనే చైనా అద్భుతం..!

Monday, February 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘మనిషి అనుకుంటే కానిది ఏమున్నది’ అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.. నిజంగానే మనిషి గట్టిగా తలుచుకుంటే ఏదైనా చేయగలడు.. ఇప్పటికే మనిషి మహోత్తర కార్యక్రమాలను చేపట్టి అద్భుతాలు, అత్యాద్భుతాలు సృష్టించడంతోనే మనం ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎలాంటి వస్తువునైనా సృష్టించడంలో.. అదే వస్తువును నాశనం చేయడంలో.. ఎలాంటి ఒరిజినల్‌కైనా డూప్లికేట్ సృష్టించడంలో నంబర్ వన్ స్థానంలో ఉండేది చైనా. ఒక్క మాటలో చెప్పాలంటే పొగడ్తలేమీ కాదు కానీ.. చైనా తమది ‘ఉక్కు సంకల్పం’ అని పలు సందర్భాల్లో నిరూపించుకుంది.

ఏంటి ఆ అద్భుతం!?
ఇదిలా ఉంటే.. పారిశ్రామిక విప్లవాన్ని ఇంటింటా తీసుకొచ్చి ప్రతి ఇంటిని ఓ కుటీర పరిశ్రమగా మార్చి ప్రపంచ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న చైనాకు ఇప్పుడు ‘కరోనా వైరస్’ రూపంలో పెద్ద సవాలే ఎదురైంది. ఈ మహమ్మారి కోసం మందుకోసం.. బాధితులను రక్షించడం కోసం సాయశక్తులా చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని రీతిలో కేవలం తొమ్మిది రోజుల్లోనే అద్భుతం సృష్టించింది. బాధితుల కోసం అన్ని సదుపాయాలతో కూడిన ఓ భారీ 1000 పడకల ఆస్పత్రిని కేవలం 9 రోజుల్లోనే నిర్మించేయడమే ఆ అద్భుతం. ఇది కరోనాతో బాధపడుతున్న.. ఆ వైరస్‌కు జన్మస్థానంగా ‘వూహన్’ నగరానికి శివారులో ఈ ఆస్పత్రిని సిద్ధం చేయడం జరిగింది.

ఎలా సాధ్యమైంది..!?
ఈ నిర్మాణంలో కాంక్రీట్ బ్లాక్స్‌ను వాడటంతో త్వరగా పనయ్యింది. మొదట పునాదులు వేసిన తర్వాత కాంక్రీట్ బ్లాక్స్‌ను ఓ క్రమ పద్ధతిలో ఒకదానిపై ఒకటి అమర్చుకుంటూ వెళ్లడం జరిగింది. తద్వారా నిర్మాణం వేగంగా అవ్వడంతో పాటు.. సమయం కూడా ఎంతో మిగులుతుంది. దానివల్ల ఎంతో సమయం ఆదా అయింది. ఈ నిర్మాణం చేపట్టేందుకు గాను మొత్తం 7వేల మంది కార్మికులను 1000 యంత్రాలను వాడటం జరిగింది. ఇలా శ్రమించడం వల్ల కేవలం తొమ్మిది రోజుల్లోనే చైనా ఈ అద్భుతమైన.. ఆస్పత్రిని నిర్మించగలిగింది.

ఎన్ని పడకలు..!?
అంతేకాదు.. ఈ భారీ నిర్మాణంలో ఆర్మీ సైతం పాలుపంచుకుంది. నిపుణులైన ఇంజనీర్లు, కార్మికులను ఆర్మీనే దగ్గరుండి చూసుకుంది. ఇలా అందరూ తలా ఓ చేయి వేయడంతో మొత్తం 1000 పడకలు, 419 వార్డులు, 30 ఐసీయూలు త్వరగా నిర్మించడానికి వీలైంది. కాగా ఈ ఆస్పత్రిలో మొత్తం 1400 మంది డాక్టర్లను అక్కడి ప్రభుత్వం నియమించింది. ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చాయి. కరోనా బాధితులు, అనుమానితులు ఎక్కడున్నా సరే ఈ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడమే. సో.. మొత్తానికి చూస్తే.. ‘బ్రాండ్ల’కు అంబాసిడర్‌గా పేరుగాంచిన చైనా.. తాజాగా నిర్మించిన అత్యద్భుతమైన ఆస్పత్రి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.