చైనాకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న భారత్

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

భారత్.. చైనాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఒక్కొక్క దానిపై నిషేధం విధిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్‌లపై నిషేధం విధించిన ఇండియా.. తాజాగా మరో షాక్ ఇచ్చింది. జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతిచ్చేదే లేదని స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా.. జాయింట్ వెంచర్లు, హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను తీసుకునేదే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ దేశంతో భాగస్వామ్యం కలిగి ఉన్న ఏ జాయింట్ వెంచర్లను ఆమోదించబోమని తేల్చి చెప్పారు. ఎంఎస్ఈల్లో సైతం చైనా పెట్టుబడులకు అనుమతిచ్చేదే లేదని గడ్కరీ స్పష్టం చేశారు.

మరోవైపు చైనాతో చర్చలతో కాలయాపన అనవసరమని భావించిన భారత్.. ఊహించని రీతిలో శతఘ్నులు, యుద్ధ ట్యాంకర్లను సరిహద్దుకు చేర్చేసింది. చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ ఇంత త్వరితగతిన చేరుస్తామని చైనా ఊహకు కూడా అందక మునుపే సరిహద్దుకు చేర్చేసింది.