సింగర్‌ మనోపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు

మీటూ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు దక్షిణాదిలో సింగర్‌ చిన్మయి రైటర్‌ వైరముత్తుపై చేసిన ఆరోపణలు సంచలనాలకు దారి తీశాయి. తర్వాత చిన్మయి తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా అందరిపై విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు సింగర్‌ మనోపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఏడాదిన్నర కాలంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు. సింగర్‌ మనో, కార్తీక మంచి సింగర్సేకానీ.. మంచి మగాళ్లు కాదు అంటూ చిన్మయి ఆరోపించారు. సోషల్‌ మీడియాలో చిన్మయి చేసిన ఈ ఆరోపణలు దుమారాన్ని రేపుతున్నాయి.

డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికల గురించి తెలియజేస్తూ సింగర్‌ మనో ఓ వీడియో విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసిన చిన్మయి ‘చాలా రోజుల క్రితం మనో నాకు ఫోన్‌ చేసి కార్తీక్‌ గురించి ఆరోపణలు చేస్తున్న వారందరినీ తీసుకుని తన ఇంటికి రమ్మన్నారు. ఈ వేధింపుల విషయంతో కార్తీక్‌ భార్య చాలా బాధపడుతుంది. తన కెరీర్‌ను ఎందుకు నాశనం చేస్తున్నావు. ఈ స్థాయికి రావడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. అలాగే కార్తీక్‌ కూడా కష్టపడ్డాడు. అని రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. నేను ఆయనలాగానే ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. అంతేకానీ ఇతరులను వేధించలేదు. ఈ ఏడాదిన్నరలో చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను’ అని చిన్మయి తెలిపారు.

More News

ఇండియ‌న్ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఫ్రెండ్ షిప్'

ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు.

రాహు శాటిలైట్ & డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న జి తెలుగు

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

45 ల‌క్ష‌ల మోసం.. యాంక‌ర్ రవి కంప్లైంట్‌

బుల్లి తెర‌పై షోస్ ద్వారా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ ర‌వి ఇది మా ప్రేమ‌క‌థ అనే చిత్రంలోనూ న‌టించారు.

మార్చి 6న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు విడుదల తేదీ మార్చి 6 అయ్యింది.

తీవ్ర ఉత్కంఠ మధ్య జయేష్ రంజన్ గెలుపు

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.