పీవీ, ప్రణబ్‌‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!

  • IndiaGlitz, [Wednesday,June 26 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం నేతల నోరు జారుడు ఎక్కువైంది. మీడియా గొట్టాలు దొరికితే చాలు.. తాము ఏం మాట్లాడుతున్నామో ఎరుగక చెప్పాల్సింది చెప్పకుండా ఏదేదో చెప్పేసి వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల విషయానికొస్తే.. ఎప్పుడు ఎవరు సొంతపార్టీపై.. పార్టీ నేతలపై తిట్ల దండకం మొదలెడతారో అర్థం కానిపరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతారన్న వార్తల నేపథ్యంలో సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఏకంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టార్గెట్‌ చేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

పీవీపై చిన్నారెడ్డి వ్యాఖ్యలివీ..

కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్ నేతలను పీవీ నరసింహారావు తొక్కేశారు. పీవీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి. సోనియా కుటుంబాన్ని అణగదొక్కాలని చూశారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ ఘోర తప్పిదం చేశారు. ఆ ఘోర తప్పిదం వల్లే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దూరం అయ్యారు. దీంతో ఆయన్ను.. గాంధీ కుటుంబం పక్కన పెట్టింది. బాబ్రీ మసీదును కూల్చినందుకే పీవీని బీజేపే నేతలు సైతం పొగుడుతున్నారు అని చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ప్రణబ్‌పై..

పీవీతో ఆపని చిన్నారెడ్డి.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావన కూడా తెచ్చారు. ప్రణబ్ కూడా పీవీలాగే వ్యవహరించారని ఆయన నోరు పారేసుకున్నారు. ప్రణబ్‌ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేస్తే.. ఆయనేమో నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేయలేదు కాబట్టే ఆయనను బీజేపీ పొగడడం లేదు అని చిన్నారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో.. ప్రభుత్వ ఏర్పాటులో పీవీ నర్సింహారావు, ప్రణబ్ కృషి గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అయితే వీరిపై చిన్నారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం గుర్రుమంటున్నారు. మరికొందరు నేతలు చిన్నారెడ్డి ఏంటి..? ఇన్ని మాటలు అనేశారని కంగుతిన్నారు కూడా. బీజేపీ నేతలు.. అధిష్టానం చిన్నారెడ్డి వ్యాఖ్యలు రియాక్ట్ అవుతుందా..? లేకుంటే లైట్ తీసుకుంటుందా..? అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

సెంటర్ ఏదైనా ఓకే.. దమ్ముంటే రా.. టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.

దొడ్డ మ‌న‌సు చాటుకున్న నిఖిల్‌

యువ హీరో నిఖిల్ త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నాడు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌చ్చిన‌ప్పుడు త‌న శ‌క్తిమేర స‌హకారం అందించే హీరో నిఖిల్ .

అతని వైపే మొగ్గు చూపుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.

‘జబర్దస్త్’ సక్సెస్‌కు ఆ ఇద్దరే కారణం: అనసూయ

జబర్దస్త్ కామెడీ షో.. ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. గురు, శుక్రవారం రోజులొస్తే చాలు అటు టీవీ చానెల్స్ ముందు..

తమ్ముళ్లూ.. బాబు భజన ఆపండి : త్రిమూర్తులు వార్నింగ్

ఇదేంటి.. తెలుగు తమ్ముళ్లకే టీడీపీ సీనియర్ నేత వార్నింగ్ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే..