చిరు 150వ సినిమా ప్రకటించేది అప్పుడే..

  • IndiaGlitz, [Friday,October 30 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ..ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. బ్రూస్ లీ ఆడియో వేడుక‌లో స్వ‌యంగా చిరంజీవే...మ‌రో 15రోజుల్లో త‌న సినిమా గురించి పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తా అన్నారు. త‌న సినిమాకి చ‌ర‌ణ్, సురేఖ నిర్మాత‌లు అని ప్ర‌క‌టించి ఖ‌చ్చితంగా ద‌స‌రా లోపే పూర్తి వివ‌రాలు చెబుతాన‌న్నారు.

ద‌స‌రా వ‌చ్చి వెళ్లిపోయింది. కానీ...చిరు 150వ సినిమా ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. తాజా స‌మాచారం ప్రకారం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. నవంబ‌ర్ రెండో వారంలో భాగ్య‌న‌గ‌రానికి చేరుకుంటారు. చ‌ర‌ణ్ వ‌చ్చిన త‌ర్వాత చిరు 150వ సినిమా గురించి ఎనౌన్స్ చేస్తార‌ట‌. మ‌రి...చ‌ర‌ణ్ విదేశాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత త‌న త‌దుప‌రి చిత్రం బిజీలో ఉంటాడో...తండ్రి సినిమా గురించి ప్ర‌క‌టిస్తాడో చూద్దాం.