close
Choose your channels

మెగాస్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్.. ‘ఆచార్య’ మోషన్ పోస్టర్..

Saturday, August 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. మరి ఈ సందర్భంగా సర్‌ప్రైజ్ లేకుంటే ఎలా? ‘ఆచార్య’ మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. ముందుగా చిత్రబృందం చెప్పినట్టే అభిమానులకు ఐ ఫీస్ట్‌గా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ వదిలింది. మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలకు ఇప్పటి, అప్పటి ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలను తెరకెక్కిస్తూ.. తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాను సక్సెస్ బాట పట్టించడంలో దిట్ట కొరటాల శివ. ఇక ఆయన మెగాస్టార్‌ను డైరెక్ట్ చేస్తున్నారంటే సినిమా ఆషామాషీగా ఉంటుందా? మోషన్ పోస్టర్‌లోనే దుమ్ము దులిపేశారు.

ధర్మస్థలి అనే గ్రామం కేంద్రంగా ఈ కథ నడుస్తుందని మోషన్ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇక మెగాస్టార్ గ్రామంలోని ఓ సమస్య కోసం పోరాడుతున్న యోధుడిలా చూపించారు. గ్రామంలో సాధువులు, గ్రామ ప్రజలు నిలబడి చూస్తుంటే.. అన్యాయం చేసే వారిపై కత్తితో పోరాడుతున్నట్టుగా చిరును మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవల్సిన మరో అంశం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మణిశర్మ అదరగొట్టేశారు. మోషన్ పోస్టర్‌లో హైలైట్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నిలిచింది. మొత్తంగా మెగాస్టార్ అభిమానుల కోసం మరో మెసేజ్ ఓరియంటెడ్ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

‘ధర్మం కోసం ఒక కామ్రెడ్ చేసిన అన్వేషణ’ అని ఈ సినిమా గురించి కొరటాల శివ ట్వీట్ చేశారు. మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా చిరు ఈ చిత్రంలో కనిపించనున్నట్టు టాక్. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై చిరు పోరాడుతారని తెలుస్తోంది.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయనున్నట్టుగా చిత్రబృందం వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.