రూ. కోటి చొప్పున ప్రకటించిన చిరు, మహేష్

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భారీగా స్పందిస్తోంది. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి బాసటగా నిలుస్తోంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు ప్రతి ఏరియా కూడా జల దిగ్బంధంలో ఉండిపోయింది. వరద ప్రవాహంలో చిక్కి సామాన్యులు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. నగరమంతా వర్షాలు గడిచిన వారం రోజులుగా నిత్యకృత్యంగా మారిపోయాయి. కాలనీలకు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. ఎక్కడ చూసినా నీళ్లే. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జనమంతా ప్రాణాలు అరచేతపట్టుకుని ఉన్నారు. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆస్తి నష్టమూ అపారం... ఇలాంటి సమయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి హీరోలంతా స్పందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌బాబు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. ఎవరికి వీలైనంత సాయం వారు చేయాలని చిరు కోరారు. ‘‘గడిచిన 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంలో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వారిని వాళ్లని చేయమని కోరుతున్నాను’’ అని చిరు పేర్కొన్నారు.

మహేష్ బాబు కూడా ఎవరికి వీలైనంత సాయం వారు చేసి.. కష్ట సమయంలో మన ప్రజానీకానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వీలైనంత సాయాన్ని అందించాలని అర్థిస్తున్నా. ఈ కష్ట సమయంలో మన ప్రజానీకానికి మనం అండగా నిలవాలి’’ అని కోరారు. అలాగే ప్రజానీకానికి అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం అభినందించారు. ‘‘ఎడతెరిపి లేని వర్షం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించలేనంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వరద ప్రభావిత కుటుంబాల కోసం చేస్తున్న కృషిని అభినందిస్తున్నా’’ అని మహేష్ పేర్కొన్నారు.

More News

రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించిన నాగ్, ఎన్టీఆర్..

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కదిలింది. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి బాసటగా నిలిచింది.

18 పేజీస్ షూటింగ్ సెట్స్ లో నిఖిల్, బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటూ వ‌రుసగా సూప‌ర్ హిట్స్ కొడుతున్నారు డైన‌మిక్ హీరో నిఖిల్.

నా తల్లిదండ్రులతో విభేదాలేమీ లేవు: పీవీ సింధు

తాను కొన్ని పనుల మీద కొద్ది రోజుల క్రితం లండన్ వచ్చానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు.

లంకా దినకర్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని సోము వీర్రాజు నిర్ణయం!

బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ గురించి తెలియని వారుండరు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు.

తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్..

తెలంగాణ సీఎం కేసీఆర్.. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.