ఒకే రోజున చిరంజీవి, ప్ర‌భాస్ పోటీ?

  • IndiaGlitz, [Thursday,November 29 2018]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. చిరంజీవి 151వ చిత్ర‌మిది. 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో కూడా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్మాత‌లు భావించారు.

అయితే ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల వార్త‌ల ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అందుకు కార‌ణంగా ఇది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొంద‌డ‌మే. అయితే అస‌లు స‌మ‌స్య ఏంటంటే అదే రోజున ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న సాహో సినిమా విడుద‌ల‌వుతుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

బాక్సాఫీస్ వ‌ద్ద రెండు భారీ చిత్రాల పోటీ అంటే డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య‌ర్ల‌కు కాస్త ఇబ్బందే. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్స్ ఎలా స్పందిస్తాయో చూడాలి.

More News

కేర‌ళ‌లో చెర్రీ సినిమాకు భారీ క్రేజ్‌

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్, స్నేహ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తుంటే..

త‌మిళ ద‌ర్శ‌కుడితో అఖిల్‌

నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రీక‌ర‌ణ‌లో బిజీ ఉన్నాడు. ఈ సినిమా ఓ సాంగ్ మిన‌హా డిసెంబ‌ర్ 3 నాటికి పూర్త‌వుతుంది.

2.0 రిలీజ్ టైమ్ లో వస్తున్నామనే ఫీలింగ్ అస్సలులేదు: శ్రీకాంత్

శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' డిసెంబర్ 1 న రిలీజవుతుంది. ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఓటర్ ని ఆలోచింపజేసేలా ఉంటుంది అని చెప్పుకున్నాడు హీరో శ్రీకాంత్.

డిసెంబ‌ర్ 7న క‌వ‌చం విడుద‌ల‌..

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని..

న్యూ ఏజ్ లవ్ స్టోరిగా 'నీ కోసం'  

అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారాం, దీక్షిత హీరోహీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న మూవీ 'నీ కోసం'.