బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కి చిరు అభినందన..

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కి చిరు అభినంద‌న అన‌గానే...ఎవ‌రా.. బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ అనుకుంటున్నారా..? ఎవ‌రో కాదు సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్ర ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌. సంక్రాంతి కానుక‌గా రిలీజైన సోగ్గాడే చిన్ని నాయ‌నా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో నేటికీ హాస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుండ‌డం విశేషం.
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...సోగ్గాడే చిన్ని నాయ‌నా డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో స‌క్సెస్ సాధించినందుకు అభినందించాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా క‌ళ్యాణ్ కృష్ణ మీడియాకి చెబుతూ..అస‌లు సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని చిరంజీవిగారితో చేయాల‌నుకున్నాన‌ని...కానీ కొన్నికార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేద‌ని చెప్పారు. అయితే సోగ్గాడే..స‌క్సెస్ గురంచి త‌న అభిమాన హీరో చిరంజీవి గారు ఫోన్ చేసి అభినందించ‌డం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఈ బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌.

More News

ఆ.. ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్ర్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

సుప్రీమ్ లో ప‌టాస్ హీరోయిన్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన చిత్రం ప‌టాస్. ఈ చిత్రం ద్వారా అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

ఇప్పుడు అన్నను ఫాలో అవుతున్నాడు

త‌మిళ క్రేజీ స్టార్ సూర్య ఇప్పుడు 24 సినిమాలో న‌టిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోగా, విల‌న్‌గా కూడా సూర్య‌నే న‌టిస్తుండ‌టం విశేషం.

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో..

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో ఎవ‌రో కాదు...మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. బ్రూస్ లీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

నితిన్ త‌దుప‌రి చిత్రం ఇదేనా..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌చిత్రం అ..ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు.