Chiranjeevi: 'చూసుకోరు వెధవలు'.. రామ్‌చరణ్‌పై చిరంజీవి వ్యాఖ్యలు వైరల్..

  • IndiaGlitz, [Monday,April 01 2024]

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఏర్పాటుచేసిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తూ పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ టాపిక్ ఎంతో సరదాగా సాగింది. ఈ స్థాయికి వచ్చినా కూడా షాంపు బాటిల్ చివర్లో.. నీళ్లు పోసి.. షేక్ చేసి వాడుకుని.. వదిలేస్తాను అంటూ విజయ్ చెప్పారు.

దీంతో చిరంజీవి కూడా తన మిడిల్ క్లాస్ అనుభవాలను పంచుకున్నారు. నువ్వే కాదు, నేను కూడా ఇప్పటికి కొన్ని మిడిల్ క్లాస్ పనులు చేస్తాను. ఇంట్లో లైట్స్ ఆన్ చేసి వదిలేస్తారు. గీజర్ ఆన్ చేసి వదిలేస్తారు. నేనే చూసుకుని ఆఫ్ చేస్తాను. ఇటీవల చరణ్ బ్యాంకాక్ వెళ్తే వాళ్ల ఫ్లోర్ లో లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మా ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్, ఏసీ ఇలా నా ఫోన్‌కి కనెక్షన్ పెట్టుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే చరణ్ అయిదు లైట్లు ఆన్ చేసి వెళ్లిపోయాడు. చూసుకోరు వెధవలు.. అవన్నీ వేస్ట్ కదా. మళ్లీ అవన్నీ నా ఫోన్ నుంచి నేనే ఆఫ్ చేసాను. అలాగే సోప్ అయిపోతుంటే కొత్త సబ్బు, పాత సబ్బుని కలిపి ఓ సబ్బుగా కంప్రెస్ చేసి వాడుతాను ఇలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ చాలా అవసరం. అన్నీ పొదుపుగా వాడుకోవాలి కరెంటు, నీరు అన్నీ చాలా ముఖ్యమైనవి అని చిరు సరదాగా వెల్లడించారు.

ఇక హీరోగా ఎదిగే క్రమంలో తాను పడిన అవమానాలను కూడా పంచుకున్నారు. న్యాయంకావాలి అనే సినిమాలో నటించాను.. శారదా చాలా గ్యాప్ తర్వాత ఆ సినిమా చేశారు. ఈ సినిమాలో కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి బోనులో నిలుచోండి అని చెప్పాడు. కోర్టు సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సుమారు నాలుగు వందల మంది అక్కడ ఉన్నారు. నేను బోనులో నిలుచున్నాను.. ఇంతలో నిర్మాత క్రాంతి కుమార్ “ఏంటండి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పిలవాలా..? వచ్చి ఇక్కడ పడి ఉండలేరా..? మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా.? అని అరిచేశాడు.

దాంతో నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి శారదా మీద ఉన్న చిరాకుతో నాపై అరిచానని చెప్పారు. అయితే ఆ అవమానమే నాలో కసిని పెంచింది. నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాట నాకు బాగా గుర్తుండిపోయింది. నేను స్టార్ అయ్యి చూపిస్తా అని అనుకున్నాను. ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నాను. అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను కాబట్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More News

మాపై ఎందుకు ఇంత పగ.. చంద్రబాబుపై రగిలిపోతున్న పేద ప్రజలు..

టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలి నుంచి పేదలంటే చులకనే. ఆయన ఎప్పుడూ పేద ప్రజల కోసం పాటుపడలేదు. కేవలం పెత్తందార్లు కోసమే తన పాలన సాగించేవారు.

Kejriwal: తిహార్ జైలుకు కేజ్రీవాల్‌.. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ..

లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Gas Price: ఎన్నికల వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు..

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించింది. నేటి నుంచే తగ్గించిన ధరలు అమల్లో వస్తాయని ప్రకటించింది.

తెలంగాణ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌లు నియామకం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఈమేరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు

KCR:పొలం బాట పట్టనున్న కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో వర్షాలు లేక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతన్నలకు భరోసా నింపేందుకు మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు.