రామారావు నా ఆత్మబంధువు.. చిరు

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు. రామారావు గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు.

నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా  పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు కళ్యాణ్ నాగ చిరంజీవి అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒకజర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

More News

టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ప్ర‌భాస్ సినిమా సెట్స్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న 20వ చిత్ర‌మిది.

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న పూజా హెగ్డే

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రంటే పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది.

వీడియో చూసి ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన బ‌న్నీ..

ఈ సంక్రాంతికి స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది.

అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్ వివాదం

మాజీ రాష్ట్ర‌ప‌తి, అణు శాస్త్ర‌వేత్త డా.అబ్దుల్ క‌లామ్ గురించి ప్రత్యేక‌మైన పరిచ‌యం అక్క‌ర్లేదు.

ప్రముఖ సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇకలేరు..

ప్రముఖ సినీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.