గుండు హనుమంతరావు మృతి తీరని లోటు : చిరంజీవి

  • IndiaGlitz, [Monday,February 19 2018]

తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను.

పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు గారి మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది.

ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.- చిరంజీవి

More News

'సంత' తొలి షెడ్యూల్ పూర్తి

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ అప్‌డేట్‌

'అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ఆ తర్వాత 'స్పీడున్నోడు', 'జయ జానకి నాయక' సినిమాలతో ప‌ల‌క‌రించాడు. ఇవేవీ ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేక‌పోయాయి.

సంక్రాంతికి రానున్న బాల‌య్య 'యన్.టి.ఆర్' ?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా 'యన్.టి.ఆర్' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ  ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి బాల‌కృష్ణ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

మరో వారం రోజుల్లో 'రంగస్థలం' టైటిల్ సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'.