ఎన్టీఆర్ కి భారతరత్న.. మెగాస్టార్ ఎలా డిమాండ్ చేశారో చూడండి

నేడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులంతా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అటు సినిమాల్లో, రాజకీయాల్లో విజయకేతనం ఎగురవేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. రాజకీయాల్లో అయితే తెలుగువారి సత్తాని ఆయన ఢిల్లీ వరకు వినిపించేలా చేశారు.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: రాజమౌళి తండ్రి ఫోన్ లో పూరి ఫోటో.. షాకింగ్ రీజన్

'ప్రముఖ గాయకులు భూపేన్‌ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం. ఆయన 100వ జయంతి దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇక తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్న జూ.ఎన్టీఆర్ కూడా తన తాతగారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకున్నారు. తెలుగు సినీప్రముఖులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఖ్యాతిని కొనియాడుతున్నారు. 

More News

2-డీజీ ఔషధం ధర ఫిక్స్..

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రశంసలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని,

ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌‌కు నివేదిక..

కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఆయుష్ తన విచారణను పూర్తి చేసి పాజిటివ్ నివేదికనే ఇచ్చింది.

దేశంలో 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. దీనికి ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.