సరదాగా అమ్మ కోసం.. తిడుతుందో.. బ్రహ్మాండం అంటుందో.. : చిరు

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల వేపుడు చేశారు. నిన్ననే ఆ వీడియోను పోస్ట్ చేస్తానన్న ఆయన విజయవాడలో కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పది మంది చనిపోయిన వార్త విని కలత చెందానని అందుకే పోస్టు చేయలేదన్నారు. నేడు ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను 30 నిమిషాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు వ్యూస్ ఇప్పటికే లక్ష దాటేశాయి. మరింకెన్ని వ్యూస్ వస్తాయో వేచి చూడాలి.

‘‘నిన్న సండే. ఖాళీగా ఉన్నాను. ఏమీ తోయడం లేదు.. ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏం చేద్దామా? అని అనుకుంటుండగా.. వంటెందుకు చేయకూడదనిపించింది. వంటనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచులు గుర్తొచ్చాయి. అమ్మ చిన్న చిన్న చేపలను.. చింతకాయ తొక్కుతో దగ్గరగా దాన్ని ఫ్రై చేసి చేసి పెట్టేది. చాలా రుచిగా ఉండేది. అమ్మ మాకింత చేసి పెట్టేది కదా.. సరదాగా అమ్మకి.. ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. మరి తిడుతుందో.. బ్రహ్మాండంగా ఉంది అంటుందో చూద్దాం’’ అంటూ చిరు చేపల వేపుడు చేసి తన తల్లికి వడ్డించారు. ఆమె రిజల్ట్ కోసం సినిమాటిక్ స్టైల్లో వెయిట్ చేశారు. ఆమె ‘చాలా బాగుంది నాన్నా’ అనడంతో చిన్నపిల్లాడిలా సంబరపడిపోయారు.

More News

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

బొత్సకి రాజకీయ గురువు, మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) మృతి చెందారు.

విజయవాడ అగ్ని ప్రమాద ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది: చిరంజీవి

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

వరల్డ్ రికార్డుగా మహేష్ బర్త్‌డే..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. తన బర్త్‌డే ప్రపంచ రికార్డ్‌కు వేదిక అవుతుందని మహేష్ కూడా ఊహించి ఉండడు.

వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాధవీలత

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తన రాజకీయ, సినీ, వ్యక్తిగత విషయాల గురించి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో