చిరు అసంతృప్తి.. సైరా వ‌చ్చే ఏడాదేనా

  • IndiaGlitz, [Saturday,December 01 2018]

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిరాశ త‌ప్పేలా లేదు. ఎందుకంటే.. ఆయ‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. సురేంద‌ర్ రెడ్డి దర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ తెలిపారు.

అయితే రీసెంట్‌గా సినిమా ఆగస్ట్‌కు వాయిదా ప‌డింద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు సినిమా మరింత ఆల‌స్య‌మ‌య్యేలా ఉంద‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. స‌మాచారం ప్ర‌కారం చిరంజీవి యాక్ష‌న్ ఏపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నాడ‌ట‌. అందువ‌ల్ల మ‌ళ్లీ రీషూట్స్ చేయ‌మ‌ని యూనిట్ చెప్పిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఇదే క‌నుక నిజ‌మైతే సినిమా విడుద‌ల మ‌రింత ఆల‌స్య‌మవుతుంది. దాదాపు సినిమా విడుద‌ల వ‌చ్చే ఏడాది కూడా ఉండ‌క‌పోవ‌చ్చున‌ని 2020లోనే సైరా సంద‌డి ఉంటుంద‌ని గుస గుస‌లు విన‌ప‌డుతున్నాయి. చిరంజీవి సినిమా ఆల‌స్య‌మ‌య్యే కొద్ది మెగా అభిమానుల‌కు కాస్త నిరాశే క‌దా...

More News

మ‌రో భారీ త్రిభాషా చిత్రం మొద‌లైంది...

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ మోహ‌న్ లాల్‌ టైటిల్ పాత్ర‌లో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. 16వ శ‌తాబ్దానికి చెందిన ప్ర‌ముఖ నావికా సేనాధిప‌తి మ‌ర‌క్కార్ జీవితానికి

అఖిల్ సినిమా పై బోయ‌పాటి క్లారిటీ...

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో చేస్తున్న 'విన‌య విధేయ రామ‌' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీ బిజీగా ఉన్నారు.

డిసెంబర్ 14న 'హుషారు' విడుదల

లక్కీ మీడియా సంస్థలో 9వ చిత్రంగా వస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' అన్ని హంగులతో ఈ నెల డిసెంబర్ 14న విడుదల అవుతుంది .ఇటీవలే ఎంతో ఉత్సాహంగా బస్సు టూర్ లో భాగంగా  తెలంగాణ

'సుబ్రహ్మణ్యపురం' కోసం రానా

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది..

గురువుతో క‌లిసి నిర్మాత‌గా...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్  వ‌ర్మ ప‌లు సినిమాల‌ను నిర్మించాడు. త‌న శిష్యుల‌ను ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేశాడు.