తన విలన్ కి మెగాస్టార్ రూ.2 లక్షల సాయం.. ఎమోషనల్ అయిన నటుడు

ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం మెగాస్టార్ చిరంజీవికి అనుదిన కార్యక్రమంగా మారిపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక సాయం చేస్తూ చిరంజీవి వార్తల్లో నిలుస్తున్నారు. చిత్రపరిశ్రమలో కరోనా బారీన పడ్డ కుటుంబాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని చిరు ఆదుకుంటున్నారు.

సరైన సమయానికి ఆక్సిజన్ అందక చాలామంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. అలాంటి వారి కోసం ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే సంచలన నిర్ణయాన్ని చిరు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: వారెవా.. కిరాక్ అనిపించేలా అల్లు శిరీష్ న్యూలుక్ వైరల్

తాజాగా మెగాస్టార్ మరొకరికి ఆర్థిక సాయం చేశారు. తాను నటించిన పలు చిత్రాల్లో విలన్ గా నటించిన తమిళ నటుడు పొన్నాంబళంని చిరు ఆదుకున్నారు. పొన్నాంబళం కిడ్నీ సమస్యతో భాదపడుతున్నారు. చెన్నైలో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. పొన్నాంబళం మెడికల్ ఖర్చులకి గాను చిరు రూ. 2 లక్షల సాయం అందించారు. నేరుగా డబ్బుని పొన్నాంబళం అకౌంట్ కే బదిలీచేశారు.

చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు , ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్ లాంటి చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. తన క్రూయల్ యాక్టింగ్ తో పొన్నాంబళం ప్రేక్షకులని అలరించారు.

ప్రస్తుతం కోలుకుంటున్న పొన్నాంబళం చిరు సాయంపై వీడియో సందేశం ద్వారా స్పందించారు. అలాగే చిరంజీవికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. 'చిరంజీవి అన్నయ్యకు ధన్యవాదాలు. నా కిడ్నీ ఆపరేషన్ కోసం మీరు పంపిన రూ.2 లక్షలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సహాయం నేను ఎప్పటికీ మరచిపోలేను. మీ పేరులోనే ఉన్న ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగానే ఉంచాలని కోరుకుంటున్నాను.. జైశ్రీరామ్' అంటూ పొన్నాంబళం తన వీడియో సందేశంలో తెలిపారు.

More News

హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'

హీరోయిన్ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఊహించని షాక్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తై..

వారెవా.. కిరాక్ అనిపించేలా అల్లు శిరీష్ న్యూలుక్ వైరల్

హీరో అల్లు శిరీష్ మంచి హిట్ కోసం చాలా కాలం నుంచి  ప్రయత్నిస్తున్నాడు. శిరీష్ కెరీర్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది.

ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్.. కిట్ ధర కూడా చాలా తక్కువే..

కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ప్రస్తుత తరుణంలో చాలా కష్టమైపోతుంది. గవర్నమెంట్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలంటే కోడి కంటే ముందే లేవాలి.

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్...13 మంది మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున