30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా ఎన్నో స్టంట్లు.. ఆ వ్యక్తి ఎవరంటే..

వెండితెరపై అభిమాన హీరోను చూడగానే అభిమానులు పొంగిపోతారు. ఆ హీరో ఏదైనా స్టంట్ చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. రిస్కీ షాట్స్ అయితే ఇక విజిల్సే. కానీ అలాంటి రిస్కీ షాట్‌లలో చేసేందుకు దాదాపు ఏ హీరో కూడా ఆసక్తి చూపించరు. ఇలాంటి సమయంలోనే డూప్‌లు అవసరపడుతూ ఉంటారు. ఎంతటి రిస్కీ షాట్స్ అయినా దర్శకుడు చెప్పినట్టు చేసుకు పోతుంటారు డూప్స్. తెరపై కనిపించే వ్యక్తుల్ని అభిమానించే ప్రేక్షకులకు డూప్‌ల గురించి మాత్రం పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని డూప్‌ల గురించి కూడా బాగానే తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డూప్‌లను కొన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల నిర్వాహ‌కులు లైమ్‌లైట్‌లోకి తీసుకొస్తుండంతో హీరోల డూప్‌ల‌కు ఇప్పుడు ఆద‌ర‌ణ బాగా ల‌భిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక డూప్ ఉన్నాడు. సమయానికి దొరికిన డూప్‌తో కానిచ్చేయకుండా.. చిరు కోసం ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. చిరంజీవి స్థానంలో ఎన్నో స్టంట్లు చేశాడు. ఈ వ్యక్తిని ఇటీవల ఒక టీవీ ఛానల్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అతని గురించి సమస్త సమాచారాన్ని మెగాస్టార్ అభిమానులకు తెలియజేసింది. ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ ఈ మ‌ధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కొత్త షోను స్టార్ట్ చేసింది.

ఈ షో నిర్వాహ‌కులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్క‌డి టాలెంట్‌ని బయ‌టి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ క్ర‌మంలో మొద‌టిసారిగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు వెళ్లారు. అక్క‌డ ఈ షోలోకి చిరంజీవి డూప్ వ‌చ్చారు. ఆయ‌న పేరు ప్రేమ్ కుమార్. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారు. చిరుకి డూప్‌గానే కాకుండా ఆయన స్వయంగా.. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఒక కంపెనీని సైతం నిర్వహిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో పాల్గొన్న ఆయ‌న‌.. రికార్డింగ్ డ్యాన్స‌ర్లంటే చాలా చిన్న చూప‌ని, వారికి ఆద‌ర‌ణ స‌రిగా ల‌భించ‌లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

More News

మద్యం, స్మోకింగ్ విమర్శలపై స్పందించిన నమిత

తమిళ చిత్ర పరిశ్రమకు శృంగార తారగా పరిచయమైన హీరోయిన్లలో నమిత ఒకరు. ఇటీవలి కాలంలో ఆమె తరచూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు.

13న దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం: ఎంఎస్ రాజు

‘తునీగ తునీగ’, ‘కేరింత’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన లవర్ బోయ్ సుమంత్ అశ్విన్ పెళ్లికొడుకు కాబోతున్నాడు.

సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న పవన్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్న 'A' ట్రైలర్!!

ప్రస్తుతం రాబోతున్న చిత్రాలలో "A" సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.

‘ఆదిపురుష్‌’ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం..!

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మూడో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్‌’ మంగ‌ళ‌వారం ముంబైలోని గోరేగాన్‌ స్టూడియోలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.