Waltair Veerayya : బాస్ సినిమా ఆలస్యం.. కట్టలు తెంచుకున్న అభిమానం, థియేటర్ అద్దాలు ధ్వంసం

  • IndiaGlitz, [Friday,January 13 2023]

సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు. వారు జనంపై, సమాజంపై వేసే ముద్ర అలాంటిది. అందుకే అంతటి ఫాలోయింగ్. తమ అభిమాన హీరో, హీరోయిన్, క్రీడాకారుడు, నాయకులను జనం బాగా అనుకరిస్తారు. షూ దగ్గరి నుంచి హెయిర్ స్టైల్ వరకు ఇలా ఆ పాదమస్తకం మక్కీకి మక్కీ దింపే వారు మన చుట్టూ కొకొల్లలు.ఇక సినిమాల విడుదలల సమయంలో వుండే హంగామా అంతా ఇంతా కాదు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు , పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలకు తోడు థియేటర్‌ను కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తారు అభిమానులు. అయితే ఫ్యాన్స్‌ను ఏమాత్రం హర్ట్ చేసినా ఆ రోజు తెరలు చిరిగిపోవడం, కుర్చీలు విరిగిపోవడం మామూలుగా వుండదు. అందుకే వారిని ఏమాత్రం నొప్పించకుండా చూసుకుంటారు.

తెల్లవారుజామునే థియేటర్ వద్దకు అభిమానులు :

ఇదిలావుండగా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. అయితే గుంటూరు జిల్లా పొన్నూరులో వాల్తేర్ వీరయ్య విడుదల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

సాంకేతిక లోపంపై ముందస్తు సమాచారం ఇవ్వని యాజమాన్యం :

స్థానిక శ్రీలక్ష్మీ థియేటర్‌లో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే ఫ్యాన్స్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే ఎంతకీ సినిమాను వేయకపోయినప్పటికీ అభిమానులు ఓపికగా ఎదురుచూశారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా సినిమాను ప్రదర్శించలేకపోతున్నామని యాజమాన్యం ప్రకటించడంతో వారి అభిమానం కట్టలు తెంచుకుంది. ముందే సమాచారం ఇవ్వకుండా ఇలా ఎందుకు చేశారంటూ ఫైర్ అయ్యారు. చివరికి కోపంతో థియేటర్ అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అభిమానులకు నచ్చజెప్పి అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు.

More News

Nandamuri Balakrishna : బాలయ్య ‘‘వీరసింహారెడ్డి’’ కోసం మంచు లక్ష్మీ ఫ్రీ ప్రమోషన్.. ఆ స్టెప్స్ అదరహో

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Pawan Kalyan:ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదు.. కానీ : పొత్తులపై పవన్ క్లారిటీ

వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాన్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక టీడీపీతో పొత్తుతో వెళ్తారా

Adnan Sami:గోల్డెన్ గ్లోబ్‌పై జగన్ ట్వీట్.. ‘‘తెలుగు జెండా’’ పదంపై అద్నాన్ సమీ ఫైర్ , ఇక రచ్చ రచ్చ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని

AP High Court: విపక్షాలకు ఊరట, జగన్ సర్కార్‌కు షాక్.. జీవో నెం.1ని సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం

Harish Shankar: ‘ఏటీఎం’ క్రెడిట్ అంతా దర్శకుడు చంద్ర మోహన్‌కు దక్కాలి.. హరీష్‌ శంకర్

టాలీవుడ్‌లో స్టార్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్‌కి సెపరేట్ గుర్తింపు ఉంది. సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఆయ‌న త‌న రూట్‌ను మార్చారు.