చిరంజీవి - కొరటాల చిత్రానికి భారీ ప్లాన్

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

మెగాస్టార్ చిరంజీవి... ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద స‌క్సెస్‌నే సొంతం చేసుకున్నారు. త‌ర్వాత ప్యాన్ ఇండియా చిత్రంగా 'సైరా న‌ర‌సింహారెడ్డి'ని సిద్ధం చేశారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోర్లా ప‌డింది. తెలుగు మిన‌హా మ‌రో భాష‌లో సైరా న‌ర‌సింహారెడ్డి మెగాక్యాంప్‌కు నిరాశ‌నే మిగిల్చింది. మేకింగ్ భారీగానే ఉన్నా, కాన్సెప్ట్ మాత్రం ఆడియెన్స్‌కు న‌చ్చ‌లేదు.

ఇప్పుడు మెగాస్టార్ త‌న 152వ సినిమాకు రెడీ అవుతున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే విడుద‌ల చేయాల‌ని మ‌రోసారి మెగాక్యాంప్ భావిస్తోంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సాధార‌ణంగా యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్స్‌తో సినిమాల‌ను కొర‌టాల త‌న సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నాడు. చిరు 152వ సినిమా కూడా దేవ‌దాయ శాఖ‌లోని అవినీతి ప్ర‌శ్నించే క‌థాంశంతో రూపొంద‌నుంద‌ట‌. దీనికి ఇప్పుడు ప్యాన్ ఇండియా మెరుగులు దిద్దుతున్నార‌ట‌. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతా ఓకే అయితే 2020 ఆగ‌స్ట్ 14న సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More News

మారుతి తదుప‌రి ఆయ‌న‌తోనేనా..?

రీసెంట్‌గా విడులైన `ప్ర‌తిరోజూ పండ‌గే` చిత్రంతో ద‌ర్శ‌కుడు మారుతి సూప‌ర్‌హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

వెన్నునొప్పితో ఆస్పత్రికెళితే యువతి శరీరంలో బుల్లెట్.. అసలేం జరిగింది!?

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాకు చెందిన అస్మాబేగం అనే యువతి వెన్ను నొప్పితో నిమ్స్‌లో అడ్మిట్ అవ్వడంతో..

ప‌వ‌న్ 27వ చిత్రం.. డిఫ‌రెంట్ పాత్ర‌లో..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే రాజ‌కీయాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

విజయ్ దేవరకొండ విలన్ గా యంగ్ హీరో

కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో నటించి ఆ తరువాత హీరోలుగా స్థిరపడ్డ వారు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

`స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3`లో ఐటెమ్ గ‌ర్ల్‌

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్యాన్స్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. అంటే కథలో భాగంగా పాటలు రావటం, వాటిల్లో స్టెప్పులు వేయటం కాదు.