‘లూసిఫ‌ర్‌’లో ‘చిరు’ మార్పులు

  • IndiaGlitz, [Wednesday,October 28 2020]

ప్ర‌స్తుతం త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను రీస్టార్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ప్లాన్స్ చేసుకుంటున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోందీ ఈ సినిమా. షూటింగ్ పూర్తి కాగానే చిరు పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా త‌దుప‌రి సినిమాను స్టార్ట్ చేసేస్తార‌ట‌. ఇప్ప‌టికే చిరంజీవి రెండు సినిమాల‌ను స్టార్ట్ చేయాల్సి ఉంది. అందులో ముందుగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను చిరు స్టార్ట్ చేస్తార‌ట‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాకు ఆకుల శివ స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను రాశాడ‌ట‌. లేటెస్ట్‌గా చిరంజీవి ఈ సినిమా సెకండాఫ్ విష‌యంలో చాలా మార్పులు చేర్పులు చేయ‌మ‌ని సూచించాడ‌ట‌. దీంతో వినాయ‌క్ అండ్ టీమ్ సెకండాఫ్‌ను చిరుకి న‌చ్చేలా మార్పులు చేస్తున్నార‌ని స‌మాచారం.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ‘లూసిఫ‌ర్‌’రీమేక్‌ను స్టార్ట్ చేయాల‌ని మెగా క్యాంప్ అనుకుంటుంద‌ట‌. చిరు 153వ చిత్రంగా ‘లూసిఫ‌ర్‌’ రీమేక్ తెర‌కెక్క‌నుంద‌ట‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీతో పాటు ఎన్.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ట‌. చిరంజీవితో ఠాగూర్‌, ఖైదీ నంబ‌ర్ 150 చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వినాయ‌క్ హ్యాట్రిక్ హిట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడ‌ట‌.

More News

చిరంజీవి సినిమాలో కీర్తి సురేష్.. ఏ పాత్రలోనంటే ?

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ ఛాన్స్ కొట్టేసింది. చిరు హీరోగా తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ను డైరెక్టర్ మెహర్ రమేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.

‘పుష్ప’ షెడ్యూల్ ప్లానింగ్‌లో చిన్న మార్పు

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

కృష్ణ-విజయనిర్మల కుటుంబ సభ్యుడు శరణ్ హీరోగా, రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభమైంది

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు.

ఓ చిన్నారి కోసం ట్రైన్ ఏకంగా 240 కి.మీ ఆగకుండా ప్రయాణించింది..

కొన్నిసార్లు ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు చాలా ఆసక్తికరంగానూ.. చరిత్రలో నిలిచిపోయేవిగానూ ఉంటాయి.

దర్శకధీరుడికి పొలిటికల్‌ హీట్‌

వివాదాలకు దూరంగా ఉండే దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పొలిటికల్‌ సెగ తగిలింది. ఈ సమస్యకు కారణం ఆయన దర్శకత్వంలో