ఓవర్ సీస్ లో చిరంజీవి సత్తా....

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ప్రెస్టిజియ‌స్ 150 మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150' సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రాంచ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త‌మిళ చిత్రం 'క‌త్తి' కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త‌రుణ్ అరోరా విల‌న్‌గా న‌టిస్తుంటే కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా క్యాథ‌రిన్ స్పెష‌ల్ సాంగ్ లో న‌టిస్తుంది.

వీలైనంత త‌ర్వ‌గా సినిమాను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. సినిమా సెట్స్‌ లోకి వెళ్ళిన‌ప్ప‌టి నుండి సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను క్లాసిక్ సినిమాస్ సంస్థ దాదాపు 13.5 కోట్ల రూపాయల‌ను చెల్లించి సొంతం చేసుకున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రిలీజ్ కు ముందే సినిమా బిజినెస్ మొత్తం పూర్త‌య్యింద‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

బాన్స్ వాడలో వరుణ్ తేజ్ ఫిదా..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఫిదా.

కొర‌టాల‌, మ‌హేష్ మెసేజ్ అదేనా...?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం ప్లాప్ త‌ర్వాత ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.  ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.

నవరస నట తిలకం మోహన్ బాబు..!

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి...ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు.

బాహుబ‌లి 2 కోసం నాగార్జున‌..!

బాహుబలి 2 ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే...మ‌రో వైపు చ‌క‌చ‌కా బిజినెస్ జ‌రిగిపోతుంది. ఇంత‌కీ బాహుబ‌లి 2 కోసం నాగార్జున..? ఏమిటి అనుకుంటున్నారా..?