close
Choose your channels

వీరాభిమాని కుమారుడికి ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరు

Monday, April 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వీరాభిమాని కుమారుడికి ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో మెగాభిమానులు ముందు వరుసలో ఉంటారు. ఇదిగో ఈ ఫొటోలో చూస్తున్న వ్యక్తి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఈయన వీరాభిమానం ఎలా చాటుకున్నాడన్నది అందరికీ తెలియాల్సిన అవసరముంది. తూర్పుగోదావరి నుంచి తనను కలవడానికి వచ్చిన వీరాభిమాని కలను మెగాస్టార్ నిజం చేశారు. తన వీరాభిమాని కుమారుడికి.. చిరు సొంత పేరు అయిన కొణిదెల శివశంకర వరప్రసాద్, సోదరుడు పవన్ పేరు కలిసేలా ‘పవన్ శంకర్’ అని నామకరణం చేశారు. ఈ ఆసక్తికర విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత సోషల్ మీడియాలో వెల్లడించింది.

‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరు...

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం, మందపల్లి గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి చిరును ప్రగాఢంగా ప్రేమిస్తూ వున్నాడు.
ప్రజారాజ్యం సమయంలో కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయగా ఆ గ్రామంలో ఇతన్ని 5 సంవత్సరాల కాలం రాజకీయంగా వెలివేయడం జరిగింది. ఆ విషయం తెలిసిన చిరంజీవి అప్పట్లో ఇంటికి పిలిపించికొని రోజంతా ఆశ్రయమిచ్చి సర్వ మర్యాదలు చేసి కుటుంబ సభ్యులందరికీ బట్టలు పెట్టి పంపించడం జరిగింది. గత సంవత్సరం ఇదే నెలలో వెంకటేశ్వర రావుకు బాబు పుట్టాడు.

అతనికి మెగాస్టారే నామకరణం చేయాలి లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అన్నాడు. ఆ విషయాన్ని చిరంజీవి తెలుసుకొని సోమవారం నాడు కుటుంబ సభ్యులు అందరిని ఇంటికి పిలిపించుకొని ఆ చిన్నారికి ‘పవన్ శంకర్’ అని నామకరణం చేసి ఆ కుటుంబంతో గంట సేపు ముచ్చటించారు. దీంతో వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులుకు ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.