close
Choose your channels

చిరు - న‌య‌న్‌.. కాంబినేష‌న్ రిపీట్‌?

Saturday, December 8, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు - న‌య‌న్‌.. కాంబినేష‌న్ రిపీట్‌?

చిరంజీవి హీరోగా కొత్త సినిమా అన‌గానే ద‌ర్శ‌కుడు, సంగీతం, కెమెరా , ప్రొడ‌క్ష‌న్ విష‌యాలు ఎంత ఆస‌క్తిని రేకెత్తిస్తాయో అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఆస‌క్తిని రేపే విష‌యం మ‌రొక‌టుంది. అదేంటంటే.. హీరోయిన్ ఎవ‌రు? అనే విష‌యం. చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా కోసం కూడా న‌య‌న‌తార డేట్ల‌ను బ్లాక్ చేయించార‌ట‌. ఈ సినిమాలోనూ ఆమే నాయిక‌గా న‌టించ‌బోతున్నార‌ట‌. ఆల్రెడీ చిరంజీవి సైరాలో న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత కొర‌టాల శివ చిత్రంలోనూ ఈ కాంబినేష‌న్ కంటిన్యూ కానుంది. చిరంజీవి స‌ర‌స‌న న‌టించే హీరోయిన్‌గా ముందు త‌మ‌న్నా పేరు వినిపించింది. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని న‌య‌న‌తార ఆక్ర‌మించిన‌ట్టు స‌మాచారం. ద‌క్షిణాదిన ప్ర‌చారానికి సైతం రాకుండా, అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న నాయిక‌గా న‌య‌న‌తార పేరు ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌టం విశేషం. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.