పాట‌తో ప్రారంభించ‌నున్న చిరు

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

'ఖైదీ నంబ‌ర్ 150'తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... తాజాగా హిస్టారిక‌ల్ డ్రామా 'సైరా.. న‌ర‌సింహారెడ్డి'తో మ‌రో భారీ విజ‌యాన్ని అందుకున్నారు.  రెండు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో త‌న స్టామినా ఏంటో మ‌రోసారి తెలియ‌జేసిన చిరు... ప్ర‌స్తుతం నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై త‌న ఫోక‌స్‌ని షిప్ట్ చేశారు.  'మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను' వంటి వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో త‌న 152వ చిత్రం చేయ‌బోతున్నాన్న సంగ‌తి తెలిసిందే. సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

కొర‌టాల గ‌త చిత్రాల త‌ర‌హాలోనే మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెర‌కెక్కనున్న  డిసెంబ‌ర్ నుంచి నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని స‌మాచారం. అంతేకాదు... రామోజీ ఫిల్మ్ సిటీలో ఇర‌వై రోజుల పాటు తొలి షెడ్యూల్ సాగుతుంద‌ని... ఈ భారీ షెడ్యూల్‌లో ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ను దృశ్యీక‌రిస్తార‌ని టాక్‌. అంతే కాకుండా ఈ షెడ్యూల్‌ను ముందు పాట‌తో స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. చిరంజీవి అంటే డ్యాన్సులు, ఫైట్స్ కాబ‌ట్టి సైరాలో మిస్ అయిన డ్యాన్స్ కంటెంట్‌ను ఈ సినిమాలో మిస్ కాకుండా కొర‌టాల చూసుకుంటున్నాడ‌ట‌.

'ఖైదీ నంబ‌ర్ 150', 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రాల‌ను నిర్మించిన చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్..మ‌రో నిర్మాత నిరంజన్ రెడ్డితో క‌లిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కూడా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. మ‌రి... తాజా ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు చూసిన చిరు... నెక్ట్స్ మూవీతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

More News

ల‌స్ట్ స్టోరీస్‌పై నందినీ రెడ్డి వివ‌ర‌ణ‌

డిజిటల్ మీడియా హ‌వా కొన‌సాగుతున్న త‌రుణంలో ప‌లు వెబ్ సిరీస్‌లు రూపొంద‌నున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌ల ట్రెండ్ త‌మిళం, తెలుగులోనూ స్టార్ట్ అయ్యాయి.

యూరప్‌కు బన్నీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీ యూరప్‌ వెళుత్నునారా? అంటే అవుననే సమాధానం ఆయన సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తుంది.

సినిమాల్లోకి రీ ఎంట్రీపై తేల్చేసిన పవన్

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు గత కొద్దిరోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

బిగ్‌బాస్‌4 హోస్ట్‌ ఆయనేనా?

తెలుగు రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్‌ బాగా క్లిక్‌ అయ్యింది. పలు వివాదాలు.. ఆసక్తికరమైన మలుపులతో సాగే బిగ్‌బాస్‌ షోకి క్రేజ్‌ అంతకంతకు పెరుగుతుంది.

'మీకు మాత్రమే చెప్తా'..3 రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్

హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా" ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.