జయ మరణ వార్త విని అవాక్కయ్యాను: చిరంజీవి

  • IndiaGlitz, [Friday,August 31 2018]

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. అకాల మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ ''మిత్రురాలు, సోదరి సమానురాలు బి.జయగారు మన మధ్య లేరు అనేది జీర్ణించుకోలేనిది. ఈ విషయం తెలిసి అవాక్కయ్యాను. నమ్మశక్యం కాలేదు. బి.ఎ.రాజు నాకు చిరకాల మిత్రుడు. చెన్నయ్‌లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బి.ఎ.రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జయగారు రైటర్‌గానే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి.

సాహిత్యంలోని అన్ని ఫీల్డులలో ఆమె నిష్ణాతురాలని చెప్పగలం. రచయిత్రిగా, పత్రిక ఎడిటర్‌గా, దర్శకురాలిగా.. ఇలా అన్ని శాఖలమీద మంచి పట్టున్న గొప్ప సాంకేతిక నిపుణురాలు. అలాంటి బి.జయ లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా మహిళా దర్శకురాలిగా ఎంతో పేరు గడించిన తను లేకపోవడం పరిశ్రమకు పెద్ద లోటు. ముఖ్యంగా మా బి.ఎ.రాజు చాలా తీరని లోటు. బి.ఎ.రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు..

'చనిపోయింది తను కాదు, నేను.. నా ఆలోచనల్లో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేకపోతే నేను లేను' అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. సోదరి జయ ఎక్కడ ఉన్నా సరే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.. బి.ఎ.రాజు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని భగవంతుడ్ని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అన్నారు.

More News

శ్రియ ఎందుకు మారిపోయింది?

పెళ్ల‌యితే అమ్మాయిల్లో మార్పు వ‌స్తుందంటారు. ఇప్పుడు శ్రియ‌ను చూసిన వారంద‌రూ ఆ మాట నిజ‌మేన‌ని అంటున్నారు.

నందమూరి సోద‌రుల డెడికేష‌న్‌

తండ్రిని పోగొట్టుకుని నిండా నాలుగు రోజులు కాక‌ముందే నంద‌మూరి సోద‌రులు త‌మ సినిమా షూటింగ్‌ల‌కు వెళ్ల‌డానికి ప్లానింగ్  చేసుకుంటున్నారు.

'పందెంకోడి 2' టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

మాస్‌ హీరో విశాల్‌-ఎన్‌.లింగుస్వామి కాంబినేషన్‌లో 2005లో విడుదలైన 'పందెంకోడి' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

సెప్టెంబరు 28న ఇదంజగత్

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్

అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ 'భైరవ గీత'..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత'.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు ఆర్జీవీ స్వయంగా అయన చేతులమీదుగా రిలీజ్ చేయగా