close
Choose your channels

సాయితేజ్ బర్త్‌డే సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్..

Thursday, October 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయితేజ్ బర్త్‌డే సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్..

సుప్రీం హీరో సాయితేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాలోని `అమృత` పాటను తాజాగా చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్ట్ కూడా చిరు పెట్టారు.

సాయితేజ్ బ్యాచ్‌లర్ లైఫ్‌పై కామెంట్ చేస్తూ చిరు పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. `హ్యాపీ బర్త్‌డే ప్రియమైన సాయితేజ్. `సోలో`గా ఉన్నప్పుడే ఫుల్‌గా ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అని చిరంజీవి పేర్కొన్నారు. దీంతో సాయితేజ్ పెళ్లంటూ ఇటీవల వచ్చిన వార్తలకు బలం చేకూరింది. ఓ పెద్దింటి అమ్మాయితో సాయి తేజ్ వివాహం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే కావడం విశేషం. కాగా.. సాయితేజ్ వివాహ బాధ్యతను అతని తల్లి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి అప్పగించినట్టు తెలుస్తోంది.

అయితే ఈ రోజు మెగాస్టార్ చేసిన ట్వీట్‌తో సాయితేజ్ వివాహం ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇక సాయితే సినిమాల విషయానికి వస్తే.. గతేడాది చివర్లో `ప్రతి రోజూ పండగే` సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో `సోలో బ్రతుకే సో బెటరు` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.