కొర‌టాల స్క్రిప్ట్‌ను వ‌ద్ద‌న్న చిరు

  • IndiaGlitz, [Monday,January 21 2019]

మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. చాలా రోజులుగా కొర‌టాల చిరు కోసం లైన్ అనుకుని మూడు నెల‌లు క‌ష్ట‌ప‌డి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి వినిపించాడు. అయితే చిరుకి ఆ స్క్రిప్ట్ పెద్ద‌గా న‌చ్చ‌లేదు. ఇప్పుడు కొర‌టాల మ‌రో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను చిత్రాల తర్వాత కొర‌టాల శివ చేయ‌బోయే సినిమా ఇదే అవుతుంది.

ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న చిరంజీవి ఇది పూర్త‌వ‌గానే కొర‌టాల సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో చిరు, కొర‌టాల సినిమా ఉంటుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు మ్యాట్నీ  ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఈ చిత్రంలో చిరు జ‌త‌గా న‌య‌న‌తార లేదా అనుష్క‌ల‌ను న‌టింప చేసేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.