జాగ్రత్తగా షూటింగ్స్ చేసుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి : చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యిన విషయం తెలిసిందే. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి చిరు అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న చిరు ఇళ్లు ఈ భేటీకి వేదిక అయ్యింది. ఈ సందర్భంగా పలు విషయాలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో భాగంగా చిరు మాట్లాడుతూ.. షూటింగ్స్, థియేటర్స్ ఎప్పట్నుంచి ప్రారంభమవుతాయనే విషయంపై ఇవాళ ఈ భేటీ జరుగుతోందన్నారు. కరోనా లాక్‌డౌన్ ముగుస్తున్న సందర్భంలో దాదాపు అన్ని రంగాలకు ప్రభుత్వం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చినప్పటికీ సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి..? అనే మీమాంస ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నారు. వాస్తవానికి సినిమా షూటింగ్స్ ప్రారంభించేందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు.. కానీ కరోనా ప్రత్యేక పరిస్థితులు గనుక ప్రభుత్వం సహకారం కావాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి నియమ నిబంధనలకు లోబడి షూటింగ్స్‌ను అత్యంత జాగ్రత్తగా చేసుకుందామని సమావేశంలో చిరు చెప్పారు.

మాకోసం కాదు.. వాళ్లకోసమే!

‘రిలీజ్‌కు రెడీగా ఉన్న సిద్ధంగా ఉన్న సినిమాల కోసమే లేక షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల దర్శకనిర్మాతల కోసం మేం ఈ వినతి చేయట్లేదు. రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితిలో ఉన్న 14 వేల మంది రోజువారీ సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వేలాది మంది కార్మికుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సినిమాటోగ్రఫీ మంత్రిగారికి, ముఖ్యమంత్రిగారికి నేను విన్నవిస్తున్నా. దయచేసి మీరు ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించాలి’ అని సమావేశంలో చిరు చెప్పుకొచ్చారు.

More News

సాయంత్రంకల్లా టాలీవుడ్ షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ !

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో

బెల్లంకొండతో సుధీర్ వర్మ?

స్వామిరారా, కేశ‌వ వంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌.

రెండు తెలుగు సినిమాల్లో హాసిని!!

బాలీవుడ్ భామ జెనీలియా తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

ఒక్కరోజే తమిళనాడులో 743.. మహారాష్ట్రలో 2,250 కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రోజురోజుకు విజృంభిస్తోంది.

వామ్మో.. ఈ నర్స్ మేడమ్ టూ హాట్ గురూ..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్స్, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తు్న్నారు.