సీక్రెట్‌ చెప్పేసిన చిరు..!!

ఈ మధ్య కాలంలో సినీ అభిమానులను, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన.. మెగాభిమానులను ఆతృత కలిగించిన వార్తల్లో మెగాస్టార్‌ చిరంజీవి లుక్ ఒకటి. ఇప్పటి వరకు చిరంజీవి కనపడని ఓ సరికొత్త లుక్‌లో చిరంజీవి కనపడటం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. గుండు గెటప్‌లో చిరు కనపడటంతో ప్రేక్షకాభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆచార్య సినిమా షూట్‌లో ఉండగానే చిరంజీవి గుండు కొట్టించుకోవడం ఏంటి? అంటే ఆయన ఆచార్య సినిమాలో అర్బన్‌ మాంక్‌ లుక్‌లో కనపడబోతున్నారా? లేక నెక్ట్స్‌ చిరు చేయబోయే వేదాళం రీమేక్‌లో చిరు గుండు లుక్‌తో కనపడబోతున్నారా? చిరు లుక్ భలే ఉందే!! ఇలా చాలా వార్తలే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

ఈ క్రమంలో తన అర్బన్‌ మాంక్‌ లుక్‌ వెనుకున్న సీక్రెట్‌ను మెగాస్టార్‌ చిరంజీవి రివీల్‌ చేశారు. అసలు గుండు గెటప్‌లో చిరు ఎలా మారాడనే వెనుకున్న సీక్రెట్‌ ప్రాస్థటిక్‌ మేకప్‌. ప్రాస్థటిక్‌ మేకప్‌ టెక్నీషియన్స్‌ చిరు లుక్‌ను ఎలా మార్చారనే వీడియోతో పాటు నా అర్బన్‌ మాంక్‌ లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌ అంటూ మెజేస్‌ను కూడా షేర్‌ చేశారు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆచార్య' సినిమా రెగ్యులర్‌ షూటింగ్ అక్టోబర్‌ నుండి ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. 

More News

శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర ఏంటి ?

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని తెలుస్తోంది. సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలతో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఆమె చావుకు కారణమని

ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన శివబాలాజీ

కరోనా మహమ్మారి కారణంగా అరకొర జీతాలతో బతికేస్తున్న జనాలపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నిర్వహించేది

బిగ్‌బాస్‌లో అభి వర్సెస్ మొనాల్ వర్సెస్ అఖిల్.. ఇంట్రెస్టింగ్..

బిగ్‌బాస్‌లో ఇవాళ ప్రేక్షకులకు కావల్సినంత స్టఫ్ దొరికేసింది. ఇవాళ నర్మదా అదేనండీ.. మన మొనాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది.

కరోనా రికవరీ రేటు పరంగా ఇండియా వరల్డ్ రికార్డ్..

ఇండియా కరోనా కేసుల సంగతి ఎలా ఉన్నా.. రికవరీ రేటు మాత్రం రికార్డ్ స్థాయిలో ఉండటం ఊరటను కలిగిస్తోంది.

మహిళా జర్నలిస్ట్‌పై మండిపడ్డ డైరెక్టర్ మారుతి..

మాతృత్వం ఓ గొప్ప వరం. అమ్మ అవడం అనేది ప్రతి మహిళకు మరో జన్మ.