శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు క‌థ‌ను బ‌య‌ట‌పెట్టిన చిరు

  • IndiaGlitz, [Monday,August 01 2016]

అల్లు శిరీష్ న‌టించిన తాజా చిత్రం శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు. పరుశురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు క‌థ‌ను బ‌య‌ట‌పెట్టేసారు. ఇంత‌కీ చిరు ఏమ‌న్నారంటే...శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఫ‌స్ట్ కాపీ చూసాను. రిచ్ ఫాద‌ర్ కి, అభ్యుద‌య భావాలు ఉన్న కొడుకు మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణ‌ను చాలా బాగా ప‌రుశురామ్ తెరకెక్కించాడు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది.

ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు బొమ్మ‌రిల్లు సినిమా గుర్తుకువ‌చ్చింది. ప‌రుశురామ్ సంద‌ర్భానుసారంగా ముత్యాల్లాంటి డైలాగ్స్ రాసాడు. బొమ్మ‌రిల్లు సినిమా ఎలా విజ‌యం సాధించిందో అలా..శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు కూడా అదే స్ధాయిలో విజ‌యం సాధిస్తుంది అనే ఆశాభావం వ్య‌క్తం చేసారు. ఇదిలా ఉంటే...ఈ మూవీ టైటిల్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌పెట్టారు. అది ఏమిటంటే...శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అనే టైటిల్ తో చిరంజీవి ఓ సినిమా చేసార‌ట‌. ఆ చిత్రంలో స‌రిత న‌టించింది. క‌ట్టా సుబ్బారావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం బాగా ఆడింది. అందుక‌నే ఈ మూవీకి బాగా క‌నెక్ట్ అయ్యాను చెప్పారు చిరు.

More News

పెళ్లిచూపులు యూనిట్ కు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

యువ‌త‌రం భావాల‌ను కొత్త రీతిలో చూపించిన త‌రుణ్ భాస్క‌ర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

రాజ‌శేఖ‌ర్ - ప్ర‌వీణ్ స‌త్తార్ మూవీ అప్ డేట్..

అంకుశం, ఆహుతి, ఆగ్ర‌హం, మ‌హంకాళి...ఇలా పోలీస్ క్యారెక్ట‌ర్స్ తో మెప్పించి యాంగ్రీమేన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ‌శేఖ‌ర్ తాజాగా మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించేందుకు రెడీ అవుతున్నారు.

బొమ్మరిల్లు వలే అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే శ్రీరస్తు - శుభమస్తు విజయం తథ్యం - చిరంజీవి

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కించారు.

జాగ్వార్ ద్వారా హీరోగా పరిచయవుతున్న నిఖిల్ సౌత్ లో పెద్ద హీరో అవుతాడు - టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సినీప్రముఖులు

75కోట్ల భారీ బడ్జెట్ తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,కర్నాటక మాజీ ముఖ్యమంత్రి,కన్నడంలో అనేక సూపర్హిట్ చిత్రాలు నిర్మించిన హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్.

'మనమంతా' లాంటి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది - మోహన్ లాల్

విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,గౌతమి ప్రధాన పాత్రల్లో సాయికొర్రపాటి,వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం 'మనమంతా'