close
Choose your channels

ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు: చిరు ఆవేదన

Monday, May 31, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు: చిరు ఆవేదన

ఎన్నో మంచి పనులు.. అన్ని ఆరోపణలు.. ఎన్నో ప్రశంసలు.. ఎన్నో చీత్కారాలు.. ఏనాడూ ప్రశంసకు పొంగిపోనులేదు.. విమర్శకు కుంగిపోనూ లేదు. చీత్కారాలకు మాత్రం మనసులోనే ఎంత కుమిలిపోయి ఉంటారో తాజాగా ఓ ఫోన్ కాల్‌ను బట్టి అర్థమైంది. ఇంతకీ ఎవరంటారా? మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఏ సపోర్ట్‌తోనూ ఇండస్ట్రీలోకి రాలేదు. కేవలం తన స్వయంకృషితో వచ్చారు. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చిరంజీవిగా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఏ ప్రకృతి విపత్తు లేదంటే మరేదైనా ఆపద తెలుగు రాష్ట్రాలకు వస్తే అందరి చూపూ మెగాస్టార్ వైపే ఉంటుంది. ఆయనతోనే స్పందన మొదలవుతుంది. అయితే ఏదో సామెత చెప్పినట్టు.. ఏ సాయం చేయకుండా ఊరికే ఉన్నవాళ్లు మంచివాళ్లే.. సాయం చేసే వాళ్లు కాస్త ఆలోచిస్తూ ప్రకటించడం ఆలస్యమైతే మాత్రం చీత్కారాలు.. మీమ్స్.. సెటైర్స్.. ప్రశంసించకున్నా పర్వాలేదు.. కానీ ఇలాంటివి వాళ్లకు ఎంత బాధను కలిగిస్తాయని ఆలోచించేవారేరీ?

తాజాగా ఓ పత్రికలో మెగాస్టార్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఓ కథనం ప్రచురితమైంది. దానిని చూసిన చిరు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఆ ఆర్టికల్ రాసిన రిపోర్టర్‌ గోపాలకృష్ణకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన తన బాధను కూడా మాటల సందర్భంగా వ్యక్తం చేశారు. ‘‘గోపాల కృష్ణ గారు ఎలావున్నారు ? చాలాకాలమైంది చూసి , మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమమమనే అనుకొంటున్నాను. మీ లాంటి వారి ఆశీస్సులతో మేమూ క్షేమమే. ప్రత్యేకించి ఈ రోజు మీకు మెసెజ్ పెట్టటానికి కారణం, మీరందిస్తున్న ప్రోత్సాహం. ఈ రోజు ఆంధ్రప్రభలోని మీ వ్యాసం నాకు ఎనలేని బలాన్నిచ్చింది . చిత్తశుద్దితో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలని మీలాంటి వారు గుర్తించి భుజం తట్టడం.. నా సేవా కార్యక్రమాలు మరింత మందికి అందించాలన్న ఆశయాన్ని బలపరుస్తుంది . ఈ సందర్బంగా మీ అబ్బాయి, నా సోదరుడు గౌతమ్‌కి నా సంతోషాన్ని తెలియచేయండి’’ అని చిరు పేర్కొన్నారు.

అలాగే ఇంకా మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘‘నా ఖర్మ ఏంటంటే.. మీడియా కూడా ఇంత పక్షపాతంతో వ్యవహరించడం ఏంటి? ఎవరి ఇంట్రస్ట్ వారికి ఉండొచ్చు. కానీ నిజాలు కూడా చేదుగా రాయడం అవతలి వారు హర్ట్ అయ్యేలా రాయడం ఏంటండి? మీరిస్తున్న ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో ఇలాంటి ప్రశంసలు, ప్రోత్సాహాలు ఎన్ని వచ్చినా కూడా ఈసమయంలో మీరందిస్తున్న ప్రోత్సాహం అవర్ ఆఫ్ డీడ్. ఎన్ని చేసినా సరే మనోళ్లేం చేయడం లేదు. ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ నేను చేసిందంతా నా కష్టార్జీతమే. నేను చేయి చాచి ఇంతవరకూ ఎవరినీ అడగలేదు. అది మీరు చాలా జెన్యూన్‌గా.. ఎనలిటికల్‌గా రాశారంటే.. ప్రతిదీ అక్షర సత్యం అన్న భావన కలిగింది. ప్రతిదీ నన్ను ఆనందింపజేయడానికి కాకుండా.. ఇదిరా ఇతను తెలుసుకోండని ప్రజలకు తెలియజేప్పేందుకు రాసినట్టుగా ఉంది’’ అంటూ తన ఆనందాన్ని గోపాలకృష్ణతో చిరు పంచుకున్నారు.

 
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.