మెగాస్టార్ మాటిచ్చాడంటే.. నిలబడతాడంతే..

  • IndiaGlitz, [Wednesday,May 26 2021]

సేవాభావానికి ప్రతిరూపం మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కరోనా కష్ట కాలంలో చిరంజీవి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడం, విరాళాలు సేకరించి సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించడం లాంటి కార్యక్రమాల్లో చిరు ముందు ఉంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్ లో అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది పేషంట్లు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా తనవంతుగా సాయం చేయాలని చిరంజీవి గొప్ప కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చిరు కొన్ని రోజుల క్రితమే మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చిరంజీవి ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ కొరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహణ జరుగుతోంది. గుంటూరు, శ్రీకాకుళం, అనంతపూర్, పశ్చిమగోదావరి లాంటి జిల్లాలో బుధవారం రోజు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని జిల్లాలో అవసరమైన చోటుకు ఆక్సిజన్ అందించనున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. అవసరమైన చోటుకు ఆక్సిజన్ అందుతుందా లేదా అని తెలుసుకునేందుకు ట్రాకింగ్ సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆర్డర్ చేసినట్లు చిరు తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు.

More News

ఆల్మోస్ట్ చనిపోయా.. బెంబేలెత్తిపోయిన నటుడు!

క్రేజీ హీరో హృతిక్ రోషన్ రిస్కీ స్టంట్స్ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే హృతిక్ నటించే చిత్రాల్లో యాక్షన్ సీన్స్ అంత అద్భుతంగా ఉంటాయి.

ఆనందయ్యపై జగపతిబాబు కామెంట్స్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ప్రస్తుతం నేషనల్ ఫేమస్. ఆయన కరోనా రోగులకు ఇస్తున్న మందు బాగా పనిచేస్తోందని జనాల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ దివి 'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్.. ఏదో క్రైమ్ జరుగుతోంది!

యంగ్ బ్యూటీ దివి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో గుర్తింపు తెచ్చుకుంది. దివి నటించిన వెబ్ సిరీస్ 'క్యాబ్ స్టోరీస్' ఫస్ట్ సీజన్ రిలీజ్ కు రెడీ అయింది.

RRR ఫైట్స్.. ఉత్కంఠ పెంచేసిన విజయేంద్ర ప్రసాద్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

చంద్ర మోహన్ చనిపోయారంటూ రూమర్స్.. ఇదీ అసలు సంగతి

సీనియర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారా ? ఈ అనుమానమే టాలీవుడ్ మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. మొన్ననే అంటే మే 23న చంద్రమోహన్ 81 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.